అయ్యో షామిలీ.. మ‌ళ్లీ పోయిందే..!


ఒక‌టి రెండు కాదు ప‌దేళ్ల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. వ‌చ్చీ రావ‌డంతోనే అమ్మ‌మ్మ‌గారింటికి వెళ్లింది. కానీ అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. ఓయ్ అంటూ ప‌దేళ్ల కింద తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన బ్యూటీ షామిలీ. ఒక‌ప్పుడు బేబీ షామిలీగా అంద‌రికీ ప‌రిచ‌య‌మే ఈ పేరు.
ఇప్పుడు హీరోయిన్ గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నా ఇమేజ్ మాత్రం రావ‌డం లేదు. బాల‌న‌టిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న షామిలీ.. హీరోయిన్ గా మాత్రం నిల‌బ‌డ‌లేక‌పోతుంది. ఓయ్ త‌ర్వాత త‌మిళ్ లో ఏడేళ్ల గ్యాప్ తీసుకుని వీర‌శివాజీ సినిమాలో న‌టించింది షామిలీ. అది కూడా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు చేసిన అమ్మ‌మ్మ‌గారిల్లు కూడా వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని సుంద‌ర్ సూర్య తెర‌కెక్కించాడు.
గ‌త వార‌మే విడుద‌లైంది ఈ చిత్రం. అయితే మ‌హాన‌టి జోరు ముందు నేల‌టికెట్ తో పాటు అమ్మ‌మ్మ‌గారిల్లు కూడా అడ్ర‌స్ గ‌ల్లంతైపోయింది. పైగా ఈ చిత్రంలో షామిలీ న‌ట‌న‌కు కూడా పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర చేసింది. మొత్తానికి ఈ బేబీకి మ‌రోసారి సారీ త‌ప్ప‌డం లేదు. మ‌రి ఎప్ప‌టికి ఈ ఓయ్ బ్యూటీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here