అరకొర దుస్తుల్లో డ్యాన్సులేసే తింగరబుచ్చి ముఖ్యమంత్రిని తప్పుబట్టడం హాస్యాస్పదం!

వై.ఎస్.ఆర్.సి.పి. ఎం.ఎల్.ఏ రోజా కు టీడీపీ నేతలకు మధ్య మాటలు యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా ఆంధ్ర రాష్ట్ర రోడ్లు మరియు బిల్డింగుల మంత్రి అయ్యన్న పాత్రుడు రోజా ను వ్యక్తిగతంగా దూషించి దుమారం రేపారు.

MLA Roja attacked by Ayyanna Patrudu

రోజా అవగాహన లేకుండా ప్రతి విషయం పై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను అదే పనిగా దూషిస్తుందని, ఆమె ఓ తింగరబుచ్చి అని అన్నారు అయ్యన పాత్రుడు.  జగన్ పాదయాత్రను అడ్డుకొనేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రోజా ఆరోపించిన సందర్భంగా పాత్రుడు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

రోజా తింగరబుచ్చిలా నోటికి అద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుందని, ప్రజలు ఆమె ఆరోపణలను సీరియస్ గా తీసుకోవడం మానేశారని పాత్రుడు అన్నారు. అంతటి తో ఆగకుండా, టీవీ షో లో అభ్యంతరకర దుస్తుల్లో డ్యాన్సులు చేసే రోజా, ముఖ్యమంత్రిని తప్పుబట్టే అరహతా లేదన్నారు అయ్యన పాత్రుడు.