అర్జున్ రెడ్డి పోరికి ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు..

 heroine Shalini Pandey
ఒక్క హిట్.. ఒక్క హిట్ ప‌డితే చాలు.. ఇండ‌స్ట్రీ అంతా బాబూ అంటారు. ఇక హీరోయిన్ అయితే మేడ‌మ్ అంటూ వెంట ప‌డ‌తారు. మ‌రి ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో హీరోయిన్ గా మారితే.. అచ్చంగా శాలినిపాండేలా ఉంటుంది. ఈ భామ ఇప్పుడు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో దున్నేస్తుంది. అన్నీ టాలెంట్స్ చూపిస్తూ అద‌ర‌గొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్ల‌కు షాలిని గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ చిత్రంలో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది ఈ థియేట‌ర్ ఆర్టిస్ట్. ఇప్పుడు వ‌ర‌స‌గా బంప‌ర్ ఆఫ‌ర్లు ఈ భామ చెంత చేరుతున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాట 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా రీమేక్ లో ఈ భామే న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది.
ఇక 100 ప‌ర్సెంట్ ల‌వ్ రీమేక్ తో పాటు మ‌హాన‌టిలోనూ న‌టిస్తుంది షాలిని పాండే. సావిత్రి బ‌యోపిక్ గా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్. ఇందులో షాలిని పోషించే పాత్రేంటి..? ఎవ‌రి కారెక్ట‌ర్ లో ఈమె క‌నిపించ‌బోతుంద‌నే విష‌యాలు మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ మ‌ధ్యే దుల్క‌ర్ స‌ల్మాన్ తో ఓ సినిమాలో న‌టించ‌బోతుంది షాలిని పాండే. ఏఎస్ కార్తిక్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ కి జోడీగా న‌టించ‌బోతుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు నిఖిల్ క‌ణిత‌న్ రీమేక్ లోనూ ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. టిఎన్ సంతోష్ ఇప్ప‌టికే శాలినికి క‌థ కూడా చెప్పి ఒప్పించాడు. మొత్తానికి అర్జున్ రెడ్డి పాప మాత్రం ఇప్పుడు వ‌ర‌స అవ‌కాశాలతో దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here