అల్లుడు మ‌రీ క్లాస్ గా ఉన్నాడుగా..

మెగా కుటుంబం అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది మాస్ ఇమేజ్. ఆ కుటుంబం నుంచి ఎవ‌రు వ‌చ్చినా కాస్త క‌ష్ట‌ప‌డితే చాలు వెంట‌నే మాస్ ఇమేజ్ వ‌స్తుంది. కానీ ఇప్పుడు మెగాస్టార్ అల్లుడు మాత్రం మ‌రోలా ఆలోచిస్తున్నాడు. ఈయ‌న చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా వ‌స్తుంది. ఈయ‌న తొలి సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రంలో క‌ళ్యాణ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇప్పుడు మ‌రో లుక్ కూడా విడుద‌ల చేసారు.

ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ లా చాలా సాఫ్ట్ గా క‌నిపిస్తున్నాడు ఈ కుర్ర హీరో. టీజ‌ర్ జూన్ 12 ఉద‌యం 8.59 నిమిషాల‌కు విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నాడు. తొలి సినిమాతోనే మామ టైటిల్ ను వాడేసుకుంటున్నాడు క‌ళ్యాణ్ దేవ్. టైటిల్ ను మాత్ర‌మే వాడుకుంటున్నారా.. లేదంటే క‌థ‌ను కూడా స్పూర్తి పొందారా అనేది చూడాలిక‌. కానీ అల్లుడికి మాత్రం త‌న టైటిల్ ఇచ్చేసాడు మెగాస్టార్. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో స‌క్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం.

క‌థ‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ టైటిల్ పెట్టారు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ సుమాళ‌విక న‌య్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ దేవ్ కు తోడుగా చాలా మంది సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కూడా ఉన్నారు. పోసాని, నాజ‌ర్, ముర‌ళి శ‌ర్మ‌, రాజీవ్ క‌న‌కాల లాంటి వాళ్లు విజేత‌లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రి ఇంత క్లాస్ గా ఉన్న క‌ళ్యాణ్.. మెగా లెగ‌సీని ఎంత వ‌ర‌కు కొన‌సాగిస్తాడో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here