అల్లుళ్లు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యారుగా..!

ఒక్కోసారి జాత‌కం తిర‌గ‌బ‌డిన‌పుడు ఎవ‌రూ ఏం చేయ‌లేరు. ఇప్పుడు మెగా అల్లుళ్ల విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఒక‌రు మేన‌ల్లుడు.. మ‌రొక‌రు అల్లుడు. ఇద్ద‌రూ డిజాస్ట‌ర్స్ ఇచ్చారు. చిరు చిన్నల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌య‌మైన సినిమా విజేత. వారం రోజుల కింద విడుద‌లైంది ఈ చిత్రం. కానీ వ‌చ్చిన‌ట్లు కూడా క‌నీసం ప్రేక్ష‌కుల‌కు తెలియ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కోటి రూపాయ‌ల షేర్ కూడా తీసుకురాకుండానే ప్ర‌యాణం ముగించేసింది ఈ చిత్రం.
రాకేశ్ శ‌శి మ‌రీ పాత క‌థ‌తో విజేత‌ను తెర‌కెక్కించే స‌రికి ఎటూ కాకుండా పోయింది సినిమా. చిరంజీవి ప‌బ్లిసిటీతో పాటు మెగా హీరోలు కూడా విజేత‌ను నిల‌బెట్టాల‌ని ట్రై చేసినా కుద‌ర్లేదు. ఇక మ‌రోవైపు మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ ప‌రిస్థితి అంత‌కంటే దారుణంగా ఉంది. తేజ్ ఐ ల‌వ్ యూతో వ‌ర‌స‌గా ఆరో డిజాస్టర్ ఈయ‌న ఖాతాలో ప‌డింది. ఇప్ప‌టికీ ఏదో ఓ శ‌క్తి ఈ కుర్ర హీరోను కాపాడుతుంది కానీ లేదంటే ఈ పాటికి సాయి దుకాణం క్లోజ్ అయిపోయేది. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమ‌ల‌తో చిత్ర‌ల‌హ‌రి సినిమా క‌మిట‌య్యాడు సాయి. ఇది కానీ తేడా కొడితే క‌చ్చితంగా ఈ మేన‌ల్లున్ని మ‌రిచిపోవ‌చ్చు ఇంకా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here