అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, “ఒక్క క్షణం” ఫస్ట్ లుక్ విడుదల… డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఒక్క క్షణం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Allu Sirish ‘Okka Nimisham’ First Look And Release Dateఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. అల్లు శిరీష్ హీరోగా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం. ఇటీవలే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హీరో హీరోయిన్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాం. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే… పోస్టర్ గురించి సోషల్ మీడియాలో హలచల్ జరుగుతోంది. ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఒక్క క్షణం చిత్ర ప్రమోషన్ ను సైతం వినూత్న రీతిలో ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు శిరీష్ , సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ లు కొత్త పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారు.  అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్  దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అని అన్నారు.
నటీనటులు – అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీర‌త్ క‌పూర్‌, కాశి విశ్వ‌నాథ్, రోహిణి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌వీణ్‌, స‌త్య‌, సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, ప్ర‌భాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి ముర‌ళి, ర‌వి వ‌ర్మ‌, శ్రీసుధ‌, చిత్రం భాషా, భిందు, ప్ర‌ణ‌వ్‌, బద్రం త‌దిత‌రులు న‌టించ‌గా…
కో ప్రొడ్యూసర్స్ – సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం – మణిశర్మ
డిఓపి – శ్యామ్ కె నాయిడు
డైలాగ్స్ – అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్ జి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ – నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ – సంపత్ కుమార్
కో డైరెక్టర్ అండ్ అడిష‌న‌ల్ డైలాగ్స్‌ – విజయ్ కామిశెట్టి
 బ్యానర్ – లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విఐ ఆనంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here