అల‌క‌పాన్పు ఎక్కిన నాగ‌శౌర్య‌..

 
 

సాధార‌ణంగా కొత్త అల్లుళ్లు అల‌క‌పాన్పులు ఎక్కుతుంటారు. బామ్మ‌ర్దులు వ‌చ్చి వాళ్ల‌ను స‌ముదాయిస్తుంటారు. కానీ ఇప్పుడు ఇక్క‌డ నాగ‌శౌర్య ఈ ప‌ని చేస్తున్నాడు. కాక‌పోతే బామ్మ‌ర్దులు మాత్రం ఎవ‌రూ క‌నిపించ‌ట్లేదు. అస‌లు విష‌యం ఏంటంటే నాగ‌శౌర్య ఈ మ‌ధ్యే క‌ణం సినిమాతో తమిళ ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా మార్చ్ లోనే విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే మూడు నాలుగు సార్లు వాయిదా ప‌డిన క‌ణం ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. హైద‌రాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించారు నిర్మాత‌లు. దీనికి ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్.. హీరోయిన్ సాయిప‌ల్ల‌వితో పాటు తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ఎన్వీ ప్ర‌సాద్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్, జెమినీ కిర‌ణ్ లాంటి ప్ర‌ముఖులు వ‌చ్చారు. కానీ హీరో నాగ‌శౌర్య మాత్రం ఈ వేడుక‌లో క‌నిపించ‌లేదు. దానికి కార‌ణం కూడా సాయిప‌ల్ల‌వే. అవును.. ఆ మ‌ధ్య ప‌ల్ల‌విపై ఓపెన్ గానే సెటైర్లు వేసాడు ఈ హీరో. త‌న‌కు సాయిప‌ల్ల‌వి తీరు న‌చ్చ‌లేద‌ని.. ఆమె త‌మ‌కు చుక్క‌లు చూపించింద‌ని చెప్పాడు శౌర్య‌. ఈయ‌న మాట ల‌కు హ‌ర్ట్ అయి సాయిప‌ల్ల‌వే తెలుగులో క‌ణం సినిమాను ప్ర‌మోట్ చేయ‌దేమో అనుకున్నారంతా కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. ప‌ల్ల‌వే ఈ సినిమా ప్ర‌మోష‌న్ కు వ‌స్తుంది.. నాగ‌శౌర్య రావ‌ట్లేదు. ఇదే ఇప్పుడు హాట్ న్యూస్. కేవ‌లం ప్రీ రిలీజ్ కు మాత్ర‌మే ఎగ్గొట్టాడా లేదంటే ప్ర‌మోష‌న్ కు కూడా దూరంగా ఉంటాడా అనేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here