అవే.. మ‌రో లుక్ వ‌చ్చేసిందిగా..నాని ఏం చేసినా ఇప్పుడు నార్మ‌ల్ కాదు.. ఆయ‌న సినిమా ఏదైనా అంచ‌నాలు భారీగా ఉంటాయి. నాని న‌టించ‌క‌పోయినా ప‌ర్లేదు పోస్ట‌ర్ పై ఆయ‌న పేరు క‌నిపించినా చాలు.. ఇప్పుడు అంచ‌నాలు.. ఆస‌క్తి రెండూ పెరిగిపోతాయి. అవే సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న న‌టించే క‌థ‌పైనే ఎంతో జాగ్ర‌త్త తీసుకునే నాని.. ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాపై ఇంకెంత జాగ్ర‌త్త తీసుకుని ఉంటాడు. ఓ క‌థ‌పై నాని డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత ప్ర‌త్యేక‌మో ఆలోచించొచ్చు. అలాంటి సినిమా అవే. ఈ చిత్ర టైటిల్ ను కాఫీలో స్మయిలీ బదులుగా ఆ అని డిజైన్ చేసారు. అప్ప‌ట్నుంచే సినిమాపై ఆస‌క్తి పెరిగిపోయింది. ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఒక్కో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌య్యే కొద్దీ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.
అవే పోస్ట‌ర్ లో భగవద్గీత.. పేప‌ర్లో చుట్టేసిన ఒక గన్.. ఆర్గాన్ డొనేషన్ (అవయవ దానం) కోసం సైన్ చేసే నో అబ్జెక్షన్ ఫామ్ ఇవ‌న్నీ చూస్తుంటే.. క‌చ్చితంగా నాని నిర్మించ‌బోయేది నార్మ‌ల్ సినిమా మాత్రం కాదు.. క‌చ్చితంగా ఏదో థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది. అవయవ దానం చుట్టూతా తిరిగే క‌థ‌లా అనిపిస్తుంది. ఓంకార్ చేసిన రాజుగారిగ‌ది అలాంటి సినిమానే. ఈ చిత్రంతో నాని పూర్తిస్థాయి నిర్మాత‌గా మారిపోతున్నాడు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే ఈ చిత్రంలోని క్యాస్టింగ్. నానిపై ఉన్న ఇష్ట‌మో లేదంటే మ‌నోడు ఏదైనా మాయ చేసాడో తెలియ‌దు కానీ నిత్యా మీనన్.. శ్రీనివాస్ అవసరాల.. రెజీనా.. ప్రియదర్శి.. ఈషారెబ్బా.. కాజల్ అగర్వాల్ ఇందులో అతిథిపాత్ర‌ల్లో నటిస్తున్నారు. దానికితోడు ర‌వితేజతో పాటు తాను కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు నాని. ఇప్ప‌టికే నిత్యామీన‌న్ లుక్ బాగుంది.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ లుక్ ఏమో 24లో సూర్య‌లా ఉంది. ఇక ఇప్పుడు ఇషారెబ్బా లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ సెట‌ప్ అంతా చూస్తుంటే అవే.. అనేది చిన్న సినిమాలా అనిపించ‌ట్లేదిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here