అ..! అప్పుడే 10 కోట్లా..? 

AWE
తొలిరోజు సినిమా విడుద‌లైన‌పుడు చూసి అంతా ఏంటీ సినిమా ఇలా ఉంది..? అస‌లు ఓ సినిమాను ఇలా కూడా తీస్తారా..? ఇలాంటి సినిమాలు ఎవ‌రు చూస్తారు అంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. కానీ అదే స్థానంలో ఎంత కొత్త‌గా ఉంది ఈ సినిమా అంటూ ప్ర‌శంసించిన వాళ్లు కూడా లేక పోలేరు. టాక్ ఎలా ఉన్నా సినిమాల మాత్రం మంచి వ‌సూళ్ల‌తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 9.4 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. షేర్ కూడా 5 కోట్ల‌కు చేరువ‌గా ఉంది. ఈ చిత్రాన్ని 6 కోట్ల‌కు బిజినెస్ చేసాడు నాని. అంటే మరొక్క కోటి వ‌స్తే చాలు.. అ.. దూకుడు చూస్తుంటే మ‌రో 4 కోట్లు ఈజీగా తీసుకొచ్చేలా ఉంది. ఓవ‌ర్సీస్ లో అయితే అ.. చిన్న‌సైజ్ అరాచ‌కాలే చేస్తుంది. అక్క‌డ ఈ సినిమాకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్ష‌కులు. ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ దాటేసి.. 7 ల‌క్ష‌ల డాల‌ర్ల వైపు ప‌రుగులు తీస్తుంది అ..! అక్క‌డ చేసిన బిజినెస్ తో పోలిస్తే ఈజీగా ట్రిపుల్ మ‌ని వెన‌క్కి వ‌చ్చేస్తుంది. దాన్ని బ‌ట్టి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అనేది అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా నాని హిట్ కొట్టాడన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here