అ.. టీజ‌ర్.. ఆశ్చ‌ర్యంగానే ఉంది..


అన‌గ‌న‌గా ఓ రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.. వాళ్లు వేట‌కు వెళ్లి నా లాంటి చేప..!
ఏ.. ఛీ ఆపు.. ఎప్పుడు ఇవే క‌థ‌లారా.. కొత్త క‌థ చెప్పండ్రా..
అవునా.. అయితే ఈ టీజ‌ర్ చూడు.. ఏంటిది అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో రొటీన్ క‌థ‌ల‌తో విసిగిపోయిన వాళ్ల కోసం తానున్నానంటూ నాని చేస్తోన్న ప్రయోగం. ఈయ‌న నిర్మించిన అ.. చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత నాని చెప్పింది నిజ‌మే అనిపించింది. నిమిషం టీజ‌ర్ లోనే సినిమాలోని 9 పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్. టీజ‌ర్ మొద‌ట్లోనే నాని చేప‌గా.. ర‌వితేజ చెట్టుగా క‌నిపించారు. వాళ్ళ వాయిస్ తోనే టీజ‌ర్ మొద‌లైంది కూడా. ఈ చిత్రంలోని ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు కూడా సినిమాపై ఆసక్తి బాగా పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదంటున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఇక రెజీనా విల‌న్ గా.. శ్రీ‌నివాస్ అస‌వ‌రాల ఏదో సైంటిస్ట్ గా.. నిత్యా మీన‌న్ ల‌వ‌బుల్ పాత్ర‌లో.. ఇషారెబ్బా డిఫెరెంట్ కోణంలో.. ప్రియదర్శి ఫేక్ చెఫ్ గా న‌టిస్తున్నారు. అస‌లు అ.. వెన‌క ఉన్న మిస్ట‌రీ ఏంటో టీజ‌ర్ తోనైనా తెలుస్తుంద‌నుకున్నారు కానీ ఈ టీజ‌ర్ తోనే ఇంకా ఆస‌క్తి పెంచేసాడు నాని. టీజ‌ర్ తో క్లారిటీ ఇవ్వ‌డం మానేసి.. మ‌రింత క‌న్ఫ్యూజ్ చేసాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. అప్ప‌టి వ‌ర‌కు సినిమా ఎలా ఉండ‌బోతుందా అని ఆలోచిస్తూ ఉండ‌ట‌మే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here