ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడు! -`కొత్తగా ఉన్నాడు’ ఆడియో వేడుకలో అతిధులు

Kottaga Vunnadu Audio Launch
తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు’. రాజా మీడియా వరల్డ్ సమర్పణలో జై బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై ఎం.కె.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన ప్రియ, సోనియా హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎం.రాధా దర్శకత్వం వహించారు. యు.కె.మురళి సంగీతం సమకూర్చారు. 
ఈ చిత్రం ఆడియో వేడుక ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ ధియేటర్ లో ఘనంగా జరిగింది. ఆడియోతోపాటు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో ఆకాష్, నిర్మాత ఎం.కె.రాజా, సంగీత దర్శకుడు  యు.కె.మురళి, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రికాధినేత సురేష్ కొండేటి, వైకుంఠపాళి నిర్మాత జైరామ్, నటుడు-నిర్మాత దినేష్ మాడ్నే, యువ దర్శకుడు రవిశర్మ, నిర్మాతలు బాల్ రెడ్డి, బలవంత్ రెడ్డి, హీరోయిన్స్ ఆర్తి సురేష్, సుమ, లక్కీ, కొరియోగ్రాఫర్ వేణు పాల్గొన్నారు.
సినిమా టైటిల్ లానే ఆకాష్ చాలా కొత్తగా ఉన్నాడని, ఈ సినిమాతో అతనికి మళ్ళీ పెద్ద హిట్ రావాలని వేడుకలో పాల్గొన్నవారంతా ఆకాక్షించారు. 
లండన్ నేపథ్యంలో జరిగే ఈ కథలో ఆంద్ర కుర్రాడిగా, తెలంగాణ కుర్రాడిగా రెండు షేడ్స్ కలిగిన పాత్రలో నటించానని, విక్రమ్ 
అరిచితుడి తరహాలో అందర్నీ అలరిస్తుందని’ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన హీరో ఆకాష్ అన్నారు. ఆకాష్ గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేనని, `కొత్తగా ఉన్నాడు’ చిత్రానికి అన్ని పాటలు బాగా కుదిరాయని మ్యూజిక్ డైరెక్టర్ యు.కె.మురళి అన్నారు. `కొత్తగా ఉన్నాడు’ చిత్రంతో తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుండడం ఆనందంగా ఉందని, ఈ చిత్రంతో తనకు మంచి బోణి లభిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత ఎం.కె.రాజా అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షాన్,  ఎడిటింగ్: ప్రేమ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here