ఆక‌ట్టుకుంటున్న చిరు గ‌డ్డం క‌హానీ.. 


చిరంజీవి లుక్ మార్చేసాడు.. మొన్న‌టి వ‌ర‌కు గ‌డ్డంతో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు క్లీన్ షేవ్ లోకి మారిపోయాడు. దానికి కార‌ణం రెండో షెడ్యూల్ చాలా దూరంలో ఉండ‌ట‌మే అనుకున్నారంతా. ఎప్పుడో ఫిబ్ర‌వ‌రిలో రెండో షెడ్యూల్ మొద‌ల‌వుతుంది క‌దా అప్ప‌టి వ‌ర‌కు గ‌డ్డం ఎందుకు అని తీసేసాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ చిరు గ‌డ్డం వెన‌క అస‌లు క‌థ మ‌రోటి ఉంది. ఈ చిత్రంలో కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ చాలా ఉంది. సిజి వ‌ర్క్ కోస‌మే ఇప్పుడు చిరంజీవి గ‌డ్డం తీసేసాడ‌ని తెలుస్తుంది. ఆ సిజి వ‌ర్క్ ఇప్ప‌టికిప్పుడు మొద‌లు పెడితే కానీ సినిమా విడుద‌ల టైమ్ కు ఔట్ పుట్ రెడీ అవ్వ‌దు. అందుకోస‌మే ప్ర‌త్యేకంగా సిటీ టీమ్ ఇప్పుడు రంగంలోకి దిగింది.
అస‌లు విష‌యం ఏంటంటే.. రోబోలో ర‌జినీకాంత్ మొహం నుంచి ఎక్స్ ప్రెష‌న్స్ తీసుకుని మోష‌న్ క్యాప్చ‌ర్ చేసిన‌ట్లు ఇప్పుడు చిరంజీవికి కూడా ఇదే సూత్రం అప్లై చేయ‌బోతున్నారు. ఇక్క‌డ కూడా చిరంజీవి ఫేస్ నుంచి కొన్ని ఎక్స్ ప్రెష‌న్స్ తీసుకోబోతున్నారు. దాన్ని ఇప్పుడే క్యాప్చ‌ర్ చేసి సిజి వ‌ర్క్ మొద‌లుపెట్ట‌నున్నారు టీం. గ‌డ్డం ఉంటే ఫేస్ లో ఎక్స్ ప్రెష‌న్స్ స‌రిగ్గా క్యాప్చ‌ర్ చేయ‌డం సాధ్యం కాదు. అందుకే గ‌డ్డం తీసేసి ఫ్రెష్ లుక్ కి మారిపోయాడు మెగాస్టార్. ఫిబ్ర‌వ‌రి 15 త‌ర్వాతే రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆలోపు మ‌ళ్లీ పాత లుక్ లోకి వ‌చ్చేస్తాడు అన్న‌య్య‌. అద‌న్న‌మాట‌.. చిరంజీవి గడ్డం వెన‌క అస‌లు క‌హానీ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here