ఆస్తులు పోగొట్టుకున్న రామ్ చ‌ర‌ణ్..

Ram Charan Rangasthalam
అదేంటి.. రామ్ చ‌ర‌ణ్ ఆస్తులు పోవ‌డం ఏంటి..? ఇదెప్పుడు జ‌రిగింది అనుకుంటున్నారా..? ఏళ్ల‌పాటు మ‌న‌తో ఉండి.. స‌డ‌న్ గా పోయేవి ఏవైనా ఆస్తులు కిందే లెక్క‌. ఈ లెక్క‌న ఇప్పుడు నిజంగానే రామ్ చ‌ర‌ణ్ త‌న ఆస్తులు పోగొట్టుకున్నాడు. అదే త‌న గ‌డ్డం. ఏడాదిన్న‌ర‌గా గుబురు గడ్డంతోనే ఉన్నాడు చ‌ర‌ణ్. సుకుమార్ రంగ‌స్థ‌లం కోసం త‌న‌ను తాను పూర్తిగా అలా మార్చేసుకున్నాడు ఈ హీరో.
ఈయ‌న్ని నార్మ‌ల్ లుక్ లో చూసి ఏడాదికి పైనే అయింది. సుకుమార్ ఎక్క‌డ రీ షూట్ అంటాడో తెలియ‌క‌.. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన త‌ర్వాత గ‌డ్డంతోనే తిరిగాడు చ‌ర‌ణ్. షూటింగ్ పూర్తిగా పూర్తైంద‌ని క‌న్ఫ‌ర్మేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత కానీ క్లీన్ షేవ్ లోకి రాలేదు మెగా వార‌సుడు. ప‌దేళ్ల కింద చ‌ర‌ణ్ ఎలా ఉండేవాడో ఆ రూపంలోకి మారిపోయాడు. తాజాగా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన చ‌ర‌ణ్ ను చూసి కొత్త లుక్ లో మెరిసిపోయాడు.
ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ మొద‌లై ప‌దేళ్లైంద‌ని.. ఏ సినిమాను కూడా ప్రేక్ష‌కుల‌ను చూడండంటూ అడ‌గ‌లేద‌ని.. ఇప్పుడు ఫ‌స్ట్ టైమ్ రంగ‌స్థ‌లం మాత్రం క‌చ్చితంగా ఓసారి చూడండంటూ చెబుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. క‌చ్చితంగా ఈ సినిమా చేసినందుకు తాను గ‌ర్వ‌ప‌డుతున్నాని చెప్పాడు మెగా వార‌సుడు. న‌టుడిగా ఇది త‌న‌కు చాలా గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంద‌ని చెప్పాడు చ‌ర‌ణ్.
మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. దీని విడుద‌ల‌కు ముందే బోయ‌పాటి సినిమాతో బిజీ కానున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఆ త‌ర్వాత రాజ‌మౌళి రెడీగా ఉన్నాడ‌క్క‌డ‌. ఈ సినిమాల్లో పాత లుక్ తో క‌నిపించ‌నున్నాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి ఏడాదిన్న‌ర‌గా దాచుకున్న ఆస్తుల్ని చ‌ర‌ణ్ ఇప్పుడు వ‌దిలేసాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here