ఆహా.. ఏమా రాజ‌సం..?


క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటూ.. 500 పైగా సినిమాల్లో న‌టించిన లెజెండ్. ఈ మ‌ధ్య ఎందుకో కానీ మోహ‌న్ బాబుకు స‌రైన పాత్ర‌లు ప‌డ‌టం లేదంటూ ఆయ‌న అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌హాన‌టి వ‌స్తుంది.
ఇందులో ఎస్వీ రంగారావుగా న‌టించాడు క‌లెక్ష‌న్ కింగ్. అప్ప‌ట్లో డైలాగులు చెప్ప‌డంలో ఎస్వీఆర్ ది మురుపురాని స్టైల్. ఇక ఇప్పుడు మోహ‌న్ బాబు డైలాగ్ డెల‌వ‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. అస‌లు ఎస్వీఆర్ ను అప్పుడు చూడ‌ని వాళ్లంతా ఇప్పుడు మోహ‌న్ బాబును చూస్తే స‌రిపోతుందేమో..? అంత‌గా ఆ పాత్ర‌లో రాజ‌సం ఉట్టిప‌డుతుంది. ఎస్వీఆర్ గా త‌న లుక్ తో చంపేసాడు క‌లెక్ష‌న్ కింగ్.
సావిత్రి జీవితంలో రంగారావు పాత్ర కూడా కీల‌క‌మే. ఈ పాత్ర కోసం మోహ‌న్ బాబు త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌నే స్థాయిలో ఇందులో ఒదిగిపోయాడు ఈయ‌న‌. ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత‌ క‌చ్చితంగా మోహ‌న్ బాబు మ‌ళ్లీ హాట్ టాపిక్ అయిపోతాడ‌న‌డంలో ఏ సందేహం లేదు. అంత‌గా ఆ క‌ళ్ల‌లో రాజ‌సం క‌నిపిస్తుంది. మ‌రి రేపు సినిమాలో ఎలా ఉండ‌బోతున్నాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here