ఆ పెళ్లిలో బూతు మ‌రీ ఎక్కువైంద‌ట‌..

VEERI DI WEDDING
బాలీవుడ్ లో ఇప్పుడు బూతు సినిమాల‌కు కొద‌వే లేదు. బోల్డ్ నెస్ పేరు చెప్పి ఇష్ట‌మొచ్చినంత బూతును ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. పైగా అక్క‌డి సెన్సార్ బోర్డ్ కూడా చాలా క‌న్వినియెంట్ గా ఉంటుంది. బోల్డ్ గా ఏదైనా విష‌యాలు చెప్పాల‌నుకున్నా కూడా బోర్డ్ అస్స‌లు నో చెప్ప‌దు. ఇప్పుడు వీరి ది వెడ్డింగ్ కూడా ఇదే.
ఈ చిత్రం జూన్ 1న విడుద‌లైంది. క‌రీనా క‌పూర్, సోన‌మ్ క‌పూర్, స్వ‌ర‌భాస్క‌ర్, శిఖ త‌స్వాలియా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని శ‌శాంక్ ఘోష్ తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో బోల్డ్ నెస్ మ‌రీ ఎక్కువగా ఉంద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. కానీ విష‌యం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంద‌నే టాక్ వ‌స్తుంది. పెళ్ళంటే ఇష్టం లేని న‌లుగురు అమ్మాయిల క‌థ ఇది. పెళ్లి త‌ర్వాత జ‌రిగే కొన్ని ఇష్యూస్.. పెళ్లికి ముందు ఉండే ఇబ్బందులు..
వాట‌న్నింటినీ అర్థ‌మ‌య్యేలా చాలా బోల్డ్ గా చూపించాడు ద‌ర్శ‌కుడు శ‌శాంక్. దాంతో సినిమాకు టాక్ బాగానే వ‌చ్చింది. పైగా దీనికి పోటీగా వ‌చ్చిన సోన‌మ్ త‌మ్ముడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ భావేష్ జోషికి ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. దాంతో ఇప్పుడు బూతు పెళ్లిపైనే ప్రేక్ష‌కులు ప్రేమ చూపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here