ఆ హీరోయిన్ కు రేట్ క‌ట్టిన వ‌ర్మ‌.. 


ఇదే మాట ఇంకో ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా అనుంటే క‌చ్చితంగా పెంట పెంట అయ్యుండేది కానీ అక్క‌డున్న‌ది వ‌ర్మ క‌దా..? ఆయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే అందుకే ఆయ‌నేం అన్నా కూడా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. వ‌ర్మ తాజాగా ఓ హీరోయిన్ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసాడు. ఆమె బాగా చేసింది అని చెప్ప‌డానికి కూడా త‌న‌దైన శైలిలో రిప్లై ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈయ‌న ఈ మ‌ధ్యే క‌న్న‌డ సినిమా ట‌గరు చూసాడు. సూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించింది మ‌న్విత హ‌రీష్. సాధార‌ణంగానే అమ్మాయిలు అంటే వ‌ర్మ‌కు మ‌హా ఇష్టం. ఇక న‌చ్చిన హీరోయిన్ దొరికితే అస్స‌లు వ‌ద‌ల‌డు ఈ ద‌ర్శ‌కుడు. త‌న సినిమాల్లో వ‌ర‌స‌గా అవ‌కాశాలు ఇచ్చేస్తుంటాడు. ఏ ముహూర్తంలో చూసాడో.. ఏ మూడ్ లో చూసాడో తెలియ‌దు కానీ మ‌న్విత ఇప్పుడు వ‌ర్మ‌కు బాగా అంటే బాగా న‌చ్చేసింది. ఆమె కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే వెంట‌నే తాను చేయ‌బోయే సినిమాలో ఈ భామ‌నే హీరోయిన్ గా తీసుకున్న‌ట్లు అనౌన్స్ చేసాడు వ‌ర్మ‌. అంత‌టితో ఆగ‌కుండా ఆమెకు రేట్ క‌ట్టేసాడు. త‌న సినిమాలో న‌టించ‌డానికి మ‌న్విత ఎంత అడిగినా.. దానికంటే 10 లక్షలు ఎక్కువే ఇస్తానంటూ ప్ర‌క‌టించాడు. దాంతోపాటు టగరు దర్శకుడు సూరిని కూడా త‌న త‌ర్వాత నిర్మించబోయే సినిమాకు ద‌ర్శ‌కుడిగా ఉండాలంటూ ట్వీట్ చేసాడు. ఎంతైనా వ‌ర్మ ప్రేమ‌నైనా.. అభిమాన‌మైనా.. కోప‌మైనా ఏదీ త‌ట్టుకోలేంరా బాబూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here