ఇండియాలో అబ్బాయిలే లేరా..?


ఛీఛీ.. అలాంటి డౌట్ ఎందుకొచ్చింది ఇప్పుడు అనుకుంటున్నారా.. ఏమో ఇప్పుడు మ‌న హీరోయిన్లు చేస్తోన్న ప‌నులు చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది మ‌రి. ఇక్క‌డ అబ్బాయిలే లేన‌ట్లు.. వాళ్ల‌కు త‌గిన వ‌రుడు ఇక్క‌డ దొర‌క‌నే దొర‌క‌న‌ట్లు అంతా ఫారెన్ నుంచి వ‌రుల్ని తెచ్చుకుంటున్నారు. అక్క‌డి వారి ప్రేమ‌లో ప‌డుతున్నారు. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఇప్పుడు హీరోయిన్లంతా ఛ‌లో ప‌క్క దేశం అంటున్నారు. త‌మ ప్రియుల్ని అక్క‌డ్నుంచే దిగుమ‌తి చేసుకుంటున్నారు. తాజాగా శ్రీ‌య కూడా ఇదే లిస్ట్ లోకి చేరిపోయింది. పెళ్లిపై చిన్న హింట్ కూడా ఇవ్వ‌కుండా స‌డ‌న్ గా ర‌ష్యా బాయ్ ఫ్రెండ్ ఆండ్ర్యూను మార్చ్ 18న పెళ్లి చేసుకుంది శ్రీ‌య‌. శ్రీ‌య కంటే ముందే చాలా మంది ముద్దుగుమ్మ‌లు ప‌క్క దేశాల‌కు కోడ‌ళ్లుగా మారిపోయారు.
ఇలియానా కూడా ఇప్పుడు మ‌న దేశం కాదు.. లెక్క ప్ర‌కారం చూస్తే ఈమె ఆస్ట్రేలియ‌న్ కోడ‌లు. ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ నిబోన్ తో కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉంది. ఈ మ‌ధ్యే సీక్రేట్ గా పెళ్లి కూడా చేసుకుంది ఈ జ‌ఘ‌న సుంద‌రి. అయితే పెళ్లి త‌న ప్రైవేట్ ఎఫైర్ అని.. అది ఎవ‌రికి చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటోంది ఇల్లీబేబీ. ఇక‌ శృతిహాస‌న్ సైతం ప‌క్క దేశం అబ్బాయితోనే చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంది. ఇప్ప‌టికే త‌న ప్రియుడు మైఖెల్ కోర్సెల్ ను కుటుంబానికి కూడా ప‌రిచ‌యం చేసింది ఈ భామ‌. మూడేళ్లుగా అత‌డితోనే డేటింగ్ లో ఉంది శృతిహాస‌న్. ఇక రాధికాఆప్టే అయితే వీళ్లందరి కంటే ముందే బ్రిట‌న్ కోడ‌లైపోయింది. ప్రీతిజంట కూడా అమెరిక‌న్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. 2012లోనే అక్క‌డి మ్యూజిక్ కంపోజర్ బెన్ డిక్ట్ టైల‌ర్ తో ఏడ‌డుగులు న‌డిచింది రాధికా ఆప్టే. బాలీవుడ్ లో ప్రీతిజింటా సైతం ప‌క్క దేశపు అబ్బాయికే ప‌డిపోయింది. ఇలా మ‌న ముద్దుగుమ్మ‌లంతా ప‌రాయి దేశాల‌కు కోడ‌ళ్లైపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here