ఇది క‌పూర్ గారి కుటుంబం..


కుటుంబం.. అన్న‌గారి కుటుంబం అన్న‌ట్లు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఓ పాట ట్రెండ్ అవుతుంది. అదే ఇది క‌పూర్ గారి కుటుంబం.. బోనీక‌పూర్ గారి కుటుంబం అని. అవును.. శ్రీ‌దేవి బ‌తికున్న‌పుడు ఈ ఫ్యామిలీ ఇలా ఉండేది కాదు. ఎవ‌రికి వాళ్లు అన్న‌ట్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆమె పోయిన త‌ర్వాత క‌పూర్ ఫ్యామిలీలో క‌దలిక‌లు వ‌చ్చాయి. అంతా ఒక్క‌టైపోతున్నారు. మాసిపోయిన బంధాల‌న్నీ మ‌ళ్లీ క‌లిసిపోతున్నాయి. మూగ మ‌న‌సులు కాస్త మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఒక‌ప్పుడు శ్రీ‌దేవి కుటుంబంతో అంటీ ముట్ట‌న‌ట్లు ఉండే బోనీక‌పూర్ పెద్ద భార్య కొడుకు అర్జున్ క‌పూర్, కూతురు అన్షుల క‌పూర్ ఇప్పుడు చెల్ళెళ్లే త‌మ ప్రాణం అంటున్నారు. త‌మ చెల్ళెళ్ల జోలికి ఎవ‌రైనా వ‌స్తే తాట తీస్తానంటూ అన్షుల క‌పూర్ ఇప్ప‌టికే ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.
శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని ట్రోల్ చేస్తూ.. ఝాన్వీ, ఖుషీపై అర్జున్ క‌పూర్ అభిమాని ఒక‌రు వ్యంగ్యంగా పోస్ట్ చేసాడు. దానికి సీరియ‌స్ అయిన అన్షుల చెల్లెల్ళ జోలికి వ‌స్తే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు చెల్లెల్ల‌కు పెద్ద‌దిక్కుగా మారిపోయాడు అర్జున్ కపూర్. అంతేకాదు.. అన్షుల క‌పూర్ కూడా ఇప్పుడు ఝాన్వి, ఖుషీల‌ను అక్కున చేర్చుకుంది. త‌ల్లి లేని బాధ ఎలా ఉంటుందో ఆరేళ్లుగా అర్జున్, అన్షుల‌కు తెలుసు. అందుకే శ్రీ‌దేవి పోయిన‌పుడు బోనీక‌పూర్ కూడా ఝాన్వీ, ఖుషీల‌కు అండ‌గా నిలిచిన త‌న పిల్ల‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఒక‌ప్పుడు చెల్లెళ్ళ‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని అర్జున్ క‌పూర్ కూడా ఇప్పుడు వాళ్ల‌కు అండ‌గా.. అన్న‌య్య‌గా నిల‌బ‌డ్డాడు. ఇక అనిల్ క‌పూర్ కూతురు సోన‌మ్ క‌పూర్ కూడా చెల్లెళ్ల‌ను ప్రేమ‌గా చూసుకుంటుంది. మొత్తానికి శ్రీ‌దేవి మ‌ర‌ణం క‌ల‌వ‌దేమో అనుకున్న క‌పూర్ ఫ్యామిలీని మ‌ళ్లీ క‌లిపింద‌న్న‌మాట‌. ఈ ర‌కంగా అయినా ఆమె ఆత్మ శాంతిస్తుందిలే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here