ఇది జెమిని వారి కుటుంబం.


మ‌హాన‌టి పుణ్యమా అని ఇప్పుడు సావిత్రి గురించి ఏ వార్త అయినా కూడా సంచ‌ల‌న‌మే. ఆమె గురించి తెలియ‌ని విష‌యాలు కూడా ఇప్పుడు రీ స‌ర్చ్ చేసి నెట్ లో పెట్టేస్తున్నారు. అదే స‌మ‌యంలో జెమిని గ‌ణేష‌న్ కూడా ఇప్పుడు తెలుగులో స్టార్ అయిపోయాడు. ఇన్నాళ్లూ ఆయ‌న సావిత్రి భ‌ర్త‌గానే తెలుసు. కానీ ఇప్పుడు ఆయ‌న గురించి ఇంకా తెలుసుకోవాల‌ని చూస్తున్నారు ప్రేక్ష‌కులు.
ఇప్పుడు జెమినీ గ‌ణేష‌న్ కూతుళ్ళంతా క‌లిసి ఒకే ఫ్రేమ్ లో క‌నిపించారు. ఈయ‌న‌కు ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. ఏడుగురు కూతుళ్లు ఉన్నారు. న‌లుగురు భార్య‌లున్నారు. అందులో చివ‌రి భార్య‌తో జెమినికి సంతానం లేదు. కానీ తొలి భార్య అలిమేలు.. రెండో భార్య పుష్ప‌వ‌ల్లి.. మూడో భార్య సావిత్రితో మాత్రం సంతానం ఉన్నారు.
ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న ఏడుగురు కూతుళ్లు క‌లిసి ఫోజిచ్చారు. అందులో ఈ మ‌ధ్యే సావిత్రిని విమ‌ర్శించిన పెద్ద కూతురు క‌మ‌ల కూడా ఉండ‌టం విశేషం. ఇది జెమినీ వారి కుటుంబం అంటూ సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటో బాగానే వైర‌ల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here