ఇదెప్పుడు సెట్ చేసావ్ నాని..?

Nani

ఎప్పుడూ ఊహకంద‌ని ప‌నులు చేస్తుంటాడు న్యాచుర‌ల్ స్టార్ నాని. మొన్నటి వ‌ర‌కు హీరోగానే ఉన్న నాని ఇదే ఏడాది నిర్మాత అయ్యాడు.. ఇప్పుడు బిగ్ బాస్ షోకు హోస్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఊహించ‌ని విధంగా ఎంతో మంది ద‌ర్శ‌కులు లైన్ లో ఉంటే కొత్త ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చి మ‌ళ్లీ షాక్ ఇచ్చాడు. గ‌తేడాది సుమంత్ తో మ‌ళ్లీ రావా లాంటి సినిమా తెర‌కెక్కించిన గౌత‌మ్ తిన్న‌నూరితో నాని సినిమా చేయ‌బోతున్నాడు.

అస‌లు ఇలాంటి సినిమా ఒక‌టి వ‌స్తుంద‌ని.. ఈ కాంబినేష‌న్ ఒక‌టి వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే విష‌యం కూడా బ‌య‌టికి రాలేదు. అంత సైలెంట్ గా అన్నీ చేసాడు నాని. శ్రీ‌రామ్ ఆదిత్య సినిమా త‌ర్వాత నాని ఏం చేస్తాడు ఏం చేస్తాడు అనుకుంటున్న త‌రుణంలో స‌డ‌న్ గా నాని ఈ సినిమా చేస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. పైగా సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతుంది.

మ‌ళ్లీరావా హిట్ కాలేదు కానీ ఈ చిత్రానికి మంచి పేరు వ‌చ్చింది. సినిమాను చాలా బాగా తెర‌కెక్కించాడంటూ గౌత‌మ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఇదే సినిమాను కాస్త పేరున్న హీరోతో చేసుంటే అదిరిపోయేది అనే మాట‌లు కూడా వినిపించాయి. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడికి నాని దొరికాడు. మ‌రి చూడాలిక‌.. ఈ కాంబినేష‌న్ ఎలాంటి మాయ చేయ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here