ఈ నెల 22న వ‌స్తోన్న `రంగీలా`

శ్రీ తిరుమ‌ల సినిమాస్ ప‌తాకంపై బాదంగీర్ సాయి, ఆర్‌కే గురు ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంయుక్త స‌మ‌ర్ప‌ణ‌లో రాకేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తాప్ కుమార్ దండెం నిర్మిస్తున్న చిత్రం `రంగీలా` (రంజిత‌, గీత‌, లాస్య‌). రేఖాబోజ్‌, నిధిసింగ్‌, న‌వ్యారాజ్, వీరేష్ బాబు, ప్రిత‌మ్ రెడ్డి, వివేక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ చిత్రంలో `ఐడ్రీమ్‌`టియ‌న్ఆర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

 

ఈ చిత్రం అన్ని కార్య క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ…“గ‌తంలో నేను `కాలాయ‌త‌స్మైన‌మః` అనే ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం చేశాను. దానికి మంచి పేరు వ‌చ్చింది.

తాజాగా ముగ్గురు అమ్మాయిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో కాంటెంప‌ర‌రీ అంశాల‌తో క్యూట్ లవ్ స్టోరీ గా `రంగీలా` చిత్రాన్ని తెర‌కెక్కించాము. క‌థ విష‌యానికొస్తే…ప‌ట్నం మోజులో ప‌డి యువ‌త త‌మ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటోంది? షార్ట్ క‌ట్ లో సంపాదించాల‌నే తొంద‌ర‌లో చివ‌ర‌కు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు? అమ్మాయిలపై జ‌రుగుతున్న దాడుల‌ను ఎలా ఎదుర్కోవాలి అనేది మా చిత్రంలో చూపించాము. ఇందులో సందేశంతో పాటు ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ పొందుప‌రిచాము.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కించడానికి మా నిర్మాత‌లు అన్ని విధాలుగా స‌హ‌క‌రించారు. మా టీమ్ అంతా ఎంతో స‌హ‌క‌రించారు. షూటింగ్ మొత్తం వైజాగ్ లో చేశాము. నటీనటులు కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో అనుభ‌వం ఉన్న‌వారిలా న‌టించారు. ముఖ్యంగా `ఐడ్రీమ్‌` టియ‌న్ఆర్ గారు మా సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర‌లో న‌టించారు. సెన్సార్ స‌భ్యులు కూడా సినిమా చాలా బావుందంటూ ప్ర‌శంసించడం మా సినిమాకు ద‌క్కిన మొద‌టి విజ‌యంలా భావిస్తున్నాం. ఈ నెల 22న గ్రాండ్ గా సినిమా  విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here