ఈ న‌గ‌రానికి ఏం కాబోతుంది..?

ఈ న‌గ‌రానికి ఏమైంది. . ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్నా ఇదే పేరు. ఓ చిన్న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సినిమాపై ఇంత బ‌జ్ ఉండ‌టం మాత్రం నిజంగా అద్భుత‌మే. త‌రుణ్ భాస్క‌ర్ విష‌యంలో ఇది జ‌రుగుతుంది.

దానికి కార‌ణం పెళ్లిచూపులు. ఈ సినిమా సృష్టించిన సంచ‌ల‌నంతోనే ఇప్పుడు ఈ న‌గ‌రానికి ఏమైంది కూడా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయిపోయింది. స్టార్ హీరోలు కూడా ఇప్పుడు ఈ చిత్రం గురించి ఆరా తీస్తున్నారు. న‌లుగురు కొత్త కుర్రాళ్ళ‌తో త‌రుణ్ భాస్క‌ర్ చేసిన ఈ ఫ‌న్ రైడ్ జూన్ 29న విడుద‌ల‌వుతుంది.

ఓవ‌ర్సీస్ లో దాదాపు 140 లొకేష‌న్స్ లో విడుద‌ల‌వుతుండ‌టం చూస్తుంటే ఈ న‌గ‌రానికి ఏమైంది ప‌క్క దేశంలోనూ కుమ్మేసేలా క‌నిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ న‌గ‌రానికి ఏమైంది అన్ని న‌గ‌రాల్లోనూ విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం క‌చ్చితంగా 20 కోట్ల రేంజ్ లోకి వెళ్తుంద‌ని న‌మ్ముతున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. అదే కానీ జ‌రిగితే అద్భుతం జ‌రిగిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here