ఉనికి కోసం అల్ల‌రోడి పోరాటం..

Allari Naresh
ఇండ‌స్ట్రీలో టైమ్ అంటే అంత మ‌రి. ఏ టైమ్ లో సుడిగాడు చేసాడో కానీ అప్ప‌ట్నుంచి న‌రేష్ కెరీర్ లో సుడి లేకుండా పోయింది. ఆ సినిమా వ‌ర‌కే సుడి ప‌నిచేసింది. ఆ త‌ర్వాత అన్నీ ఫ్లాపులే కానీ ఒక్క హిట్ కూడా లేదు. ఐదేళ్లైంది ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా హిట్ కాలేదు. 2012లో వ‌చ్చిన సుడిగాడు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం లేదు ఈ కుర్ర హీరోకు. మ‌రో రాజేంద్ర ప్ర‌సాద్ అవుతాడ‌నుకుంటే.. ఎటు వెళ్లిపోతున్నాడో తెలియ‌ని గ‌మ్యం వైపు వెళ్తున్నాడు అల్ల‌రోడు. ఈయ‌న కెరీర్ తీరం తెలియ‌ని నావ‌లా.. చుక్కాని లేని ప‌డ‌వ‌లా మారిపోయిందిప్పుడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న కెరీర్ ఎక్క‌డైతే ఆగిపోయిందో.. అక్క‌డే మ‌ళ్లీ మొద‌లు పెడుతున్నాడు అల్ల‌రోడు. ఈయ‌న సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్నాడు. అల్ల‌రి న‌రేష్ చేతిలో ప్ర‌స్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటితో ఇ స‌త్తిబాబు.. కొత్త ద‌ర్శ‌కుడి సినిమాలు ప‌క్క‌న‌బెడితే సుడిగాడు 2 చేస్తున్నాడు న‌రేష్. భీమినేని శ్రీ‌నివాస‌రావ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 27న ముహూర్తం జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రం త‌మిళ్లో వ‌స్తోన్న త‌మిళ్ ప‌డం 2 రీమేక్ గా  తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇందులో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. అప్ప‌ట్లో వీళ్ళ కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాలు బాగానే ఆడాయి. ఇప్పుడు మ‌రోసారి క‌లిసి న‌టించ‌బోతున్నారు ఈ ఇద్ద‌రూ. దాంతోపాటు మ‌హేశ్ బాబు సినిమాలోనూ అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తానికి చూడాలి ఏ సినిమాతో న‌రేష్ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here