ఎంత స‌క్క‌గుందే.. విజువ‌ల్ ఎంత స‌క్క‌గుందే.. 


ఇప్పుడు రంగ‌స్థ‌లంలో విడుద‌ల అవుతున్న ఒక్కోపాట చూసి ఇదే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ఒక‌దాన్ని మించి మ‌రోటి ఉండేలా పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. తాజాగా ఎంత స‌క్క‌గున్నావే సాంగ్ టీజ‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ రోజుల్లో పాట‌లంటే ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులో లిరిక్స్ కోసం గూగుల్లో వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. కానీ ఇప్పుడు రంగ‌స్థ‌లం పాట‌ల‌ను చూసిన త‌ర్వాత ఈ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకంటే ఇందులో ప‌దాల‌న్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ఆడియో సాంగ్స్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు విజువ‌ల్ గా కూడా పాట‌లు దుమ్ము లేపేస్తున్నాయి. ఇప్పుడు 30 సెక‌న్ల టీజ‌ర్ లోనే త‌న ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేసింది స‌మంత‌.
ఇక రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న మ‌న‌సులోని రామ‌ల‌క్ష్మిని పొగుడుతూ చిట్టిబాబు పాడే ఈ పాట ఇప్ప‌ట్నుంచే ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను లాగేస్తుంది. ఈ పాట రేపు సినిమాలో క‌చ్చితంగా హైలైట్ అవుతుందంటున్నాడు సుకుమార్. చిట్టిబాబు.. రామ‌ల‌క్ష్మిలు మీ మ‌నసు దోచేస్తారంటున్నాయన‌. ఇక ఎంత స‌క్క‌గున్నావే పాట‌కు కూడా అన్ని వైపుల నుంచి అద్భుత‌మైన రెస్నాన్స్ వ‌స్తుంది. చాలా రోజుల మంచి తెలుగు అర్థాలున్న పాట విన్నామ‌న్న తృప్తి చాలా మందికి క‌లుగుతుంది. దీనికి చంద్ర‌బోస్ కూడా ఓ కార‌ణం. యేరుసెన‌గ కోసం మ‌ట్టి త‌వ్వితే అనుకోకుండా చేతికి దొరికిన లంకెబిందెలాగా ఎంత స‌క్క‌గున్నావే అంటూ మొద‌ల‌య్యే ఈ పాట అమ్మ‌లోని క‌మ్మ‌దనాన్ని గుర్తు చేస్తుంది. ఎక్క‌డా ఎక్కువ మ్యూజిక్ లేకుండా సింపుల్ గా వ‌యోలిన్ తోనే పాటంతా పాడేసాడు దేవీ. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here