ఎంసిఏ.. ఇంటా బ‌య‌టా ర‌చ్చ ర‌చ్చే..

MCA

సినిమా సినిమాకు పెరుగుతున్న నాని రేంజ్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌డం గ్యారెంటీ. స్టార్ హీరోలు కూడా ఈర్ష ప‌డే రేంజ్ లో ఇప్పుడు నాని సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో అయితే ఇప్పుడు నాని స్టార్. అక్క‌డ ఈయ‌న సినిమా విడుద‌లైతే క‌నీసం మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం ఖాయం. నేనులోక‌ల్.. నిన్నుకోరితో ఈ ఏడాది ఆల్రెడీ అక్క‌డ రెండుసార్లు మిలియ‌న్ మార్క్ దాటాడు. ఇక ఇప్పుడు మూడో హిట్ కు రెడీ అవుతున్నాడు. ఈయ‌న న‌టించిన ఎంసిఏ విదేశాల్లో ఏకంగా 148 లొకేష‌న్ల‌లో విడుద‌ల‌వుతుంది. నాని కెరీర్ లోనే ఇది హైయ్య‌స్ట్. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన ఈ ఫీట్ ఇప్పుడు నాని సొంతం చేసుకున్నాడు. అంటే నాని కూడా స్టార్ అయిపో యాడ‌న్న‌మాట‌. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయం అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఎమోష‌న్స్ ను ప‌క్కాగా క్యారీ చేస్తూ వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. దిల్ రాజు నిర్మాత‌. డిసెంబ‌ర్ 21న‌ ఎంసిఏ విడుద‌ల కానుంది.
డిసెంబ‌ర్ 16న ప్రీ రిలీజ్ ఈవెంట్ హ‌న్మ‌కొండ‌లో సాయంత్రం 5.30 నిమిషాల నుంచి జ‌ర‌గ‌నుంది. ట్రైల‌ర్ లోనే డైలాగుల‌తో ర‌చ్చ చేసాడు నాని. అర్థ‌రూపాయి పెట్రోల్ ధ‌ర పెరిగితే.. అర్థ‌రాత్రి అర‌కిలోమీట‌ర్ బంకు బ‌య‌ట నిల్చుంటాం.. అలాంటిది ఫ్యామిలీ జోలికి వ‌స్తే ఊరుకుంటామా అని నాని చెప్పిన డైలాగ్ సూప‌ర్ అంతే. ఎంసిఏ ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. అస‌లు ఈ బిజినెస్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. ర‌వితేజ సినిమాల‌కు కూడా ఈ రేంజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం లేదిప్పుడు. ఎంసిఏ కానీ హిట్టైతే నాని రేంజ్ పక్కాగా 50 కోట్ల‌కు చేర‌డం ఖాయం. ఇదే జ‌రిగితే ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల సీట్ల‌కు నాని ఎర్త్ పెట్ట‌డం కూడా ఖాయం. చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here