ఎంసిఏ.. హ‌లో.. అస‌లు టాక్ ఏంటో తెలుసా..? 

ఒకేరోజు గ్యాప్ లో రెండు సినిమాలు వ‌స్తున్నాయి. పైగా రెండూ భారీ సినిమాలే. రెండింటిపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. క్రేజీ సినిమాలే కాబ‌ట్టి రెండూ హిట్ అవుతాయిలే అని ద‌ర్శ‌క నిర్మాత‌లు ధీమాగా క‌నిపిస్తున్నారు. కానీ బ‌య్య‌ర్ల‌కు టెన్ష‌న్ అయితే ఉంటుంది క‌దా.. ఏ సినిమా ఎలా ఉండ‌బోతుందో అని..! ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనూ ఇదే టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఎంసిఏ.. హ‌లోలో ఏది హిట్ అవుతుంది.. ఏది ఆడ‌ద‌నే చిన్న సైజ్ స‌ర్వే ఒక‌టి న‌డుస్తుంది. ఈ విష‌యంలో రేస్ లో ముందు నిలుస్తుంది ఎంసిఏ. ఈ చిత్రానికి తిరుగులేద‌ని.. క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టాక్ వెళ్లిపోయింది. నాని ఇప్పుడున్న ఫామ్.. సాయిప‌ల్ల‌వి ఎంట్రీ.. దిల్ రాజు ల‌క్కీ హ్యాండ్.. ఇలా అన్నీ క‌లిసి ఎంసిఏను టాప్ లో నిల‌బెట్టాయి. ఈ సారి క‌చ్చితంగా నాని 35 కోట్ల హిట్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.
ఇక మ‌రోవైపు హ‌లోకు కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. ఈ చిత్రం రెగ్యుల‌ర్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ కాదు. ఇదో టిపిక‌ల్ ల‌వ్ స్టోరీ. విక్ర‌మ్ కే కుమార్ సినిమాల్లో క‌నిపించే ఆ మ్యాజిక్ ఇందులోనూ ఉంటుంది. అఖిల్ కు ఈ చిత్రం కోరుకున్న విజ‌యాన్ని అందించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. కాక‌పోతే మ‌రీ క్లాస్ గా ఉండ‌టం.. మాస్ జ‌నాల‌కు ఈ చిత్రం ఎక్కుతుందో ఎక్క‌దో అనే భ‌యం మాత్రం క‌నిపిస్తుంది. ఎంసిఏతో పోటీలో కాస్త వెన‌కాలే ఉన్న‌ప్ప‌టికీ టాక్ బాగుంటే త‌న స్టార్ ప‌వ‌ర్ తో నానిని వెన‌క్కి నెట్టేసినా నెట్టేస్తాడు అఖిల్. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు. అయితే ప్ర‌స్తుతానికి ఉన్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తే మాత్రం ఎంసిఏ కాస్త ఎడ్జ్ లో ఉంది.. ఎందుకంటే ఓ రోజు ముందుగానే వ‌స్తుంది క‌దా. ఆ టాక్ హెల్ప్ కానుంది సినిమాకు. ఇక హ‌లో కూడా బాగుంద‌నే చెబుతున్నారు. రెండూ వ‌చ్చి హిట్టైతే ఇండ‌స్ట్రీకే మంచిది క‌దా..! అదే జ‌ర‌గాల‌ని కోరు కుందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here