ఎన్టీఆర్ ఐపిఎల్ యాడ్ అదుర్స్..


ఎన్టీఆర్ అంటే భారీ డైలాగుల‌కు పెట్టింది పేరు. అది యాడ్స్ అయినా.. సినిమాలైనా మ‌నోడు డైలాగ్ చెబితే ప‌డిపోవాల్సిందే. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఐపిఎల్ యాడ్ వ‌చ్చింది. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ యాడ్ ఇప్పుడు టీవీల్లో ప్లే అవుతుంది. తాజాగా విడుద‌లైన ఈ యాడ్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. యాడ్ అంటే ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఎన్టీఆర్ తో ఓ భారీ డైలాగ్ కూడా చెప్పిం చాడు మాట‌ల మాంత్రికుడు. త‌ను కూడా పెన్నుకు బాగానే ప‌దును పెట్టాడు. తెలుగులో ఐపిఎల్ వ‌స్తుంద‌ట అని ఒక‌రంటే.. టీవీలో వ‌స్తుంది క‌దా ఇంకెందుకు అని ఇంకొక‌రు అంటారు. అప్పుడు ఎన్టీఆర్ వెంట‌నే కారం లేని కోడి.. ఉల్లిపాయ లేని ప‌కోడి.. పెట్రోల్ లేని గాడి.. మీసం లేని రౌడీ.. ఆవ‌కాయ్ లేని జాడీ.. ప్రేమ‌గా అమ్మ ఒడి.. అంటూ భారీ డైలాగ్ ఒక‌టి సింపుల్ గా చెప్పేసాడు. తెలుగులో చూస్తే ఐపిఎల్ కు వ‌చ్చే మ‌జానే వేరు అని చెప్ప‌డానికి ఈ యాడ్ షూట్ చేసారు. మొత్తానికి ఎప్రిల్ 7 నుంచి ఈ తెలుగు ఐపిఎల్ మ‌న స్టార్ గ్రూప్ లోనే సంద‌డి చేయ‌బోతుంద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here