ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తీయబోయే చిత్ర కథ తెలిసిపోయింది!

 

బాహుబలి తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రమేంటా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చాడు దర్శకధీరుడు. జక్కన్న తర్వాతి చిత్రం మల్టీ-స్టార్రర్ అనే వార్తలు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళి తండ్రి, రచయితా అయినా విజయేంద్ర ప్రసాద్ ఓ మల్టీ-స్టార్రర్ కథ తయారుచేస్తున్నట్లు ఇదివరకే ఒకానొక సందర్భంలో చెప్పారు. తాజాగా జవాన్ ప్రచార కార్యక్రమంలో  సాయి ధరమ్ తేజ్ తాను కూడా రాజమౌళి షేర్ చేసిన ఫోటో చూసి అవాక్క్కయ్యానని, చరణ్ కు ఫోన్ చేసి నిజామా అని అడుగగా అవునన్నాడని కంఫర్మ్ చేసాడు సుప్రీమ్ హీరో. జక్కన్న, తారక్, చరణ్ మల్టీ-స్టార్రర్ కంఫర్మ్ కావడంతో మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అప్పుడే చిత్ర కథ మీద వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ లు బాక్సర్లు గా కనిపిస్తారని, చిత్రం పేరు ‘యమధీరా’ అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here