ఎన్టీఆర్ బయోపిక్ లో క్రిష్ కంప్రమైజ్ అవుతాడా!


ఎన్టీఆర్ (NTR)బయోపిక్ కి క్రిష్.. డైరెక్టర్ అని ప్రకటించిన తర్వాత బయోపిక్ అంటే అంత సులభమా అని ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న అయితే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి బయోపిక్ అంత సులభం కాదు తన జీవితం లో ఉన్న అన్ని ఒక పరిమితి సమయం లో చూపించడం అంటే సాహసమే.
సమాజంలో బాగా గొప్పగా చెడుగా గుర్తించబడిన వ్యక్తుల యొక్క జీవితాలను సినిమా లు పుస్తకాలు గా జనాల ముందుకు తీసుకువచ్చే క్రమంలో 20 శాతం… ఆ పరిస్థితులలో ఉన్న వ్యక్తుల అభిప్రాయాలు… 80 శాతం రచయిత ల యొక్క సొంత అభిప్రాయాలు కగలిపి ఉంటుంది…
ఇక్కడ చాలా వరకు ఆ రచయిత యొక్క ఉద్దేశం… ఆ వ్యక్తుల మీద జనాలకున్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని మాత్రమే ఉంటుంది తప్ప నిజమైన లేక అతడు సేకరించని 80% మంది అభిప్రాయాలు బయటి జనాలకు చెప్పడం మాత్రం ఉండదు… అప్పటికి ఉన్న పరిస్థితులలో ఏ విధంగా చెప్తే జనాలకు ఆమోధ్యకరంగా.. ఉంటుందో…
రచయిత ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది
ఆలా ఆర్జీవీ తీసిన సినిమాలే చూసుకుంటే ..
ఆర్జీవీ పరిటాల రవి, మద్దెలచెరువు సూరి ల వైర్యాన్ని… ఆధారంగా చేసుకొని తీసిన రక్తచరిత్ర లు…
మొదటి భాగం లో రవి గురించి చెప్తూ… రెండో భాగంలో సూరి, రవి ల వైర్యం… చూపిస్తూ… చివరికి వచ్చేసరికి రవి ని చెడ్డవాడిగా చూపించడం జరిగింది… అనేది రవి గారి అభిమానుల అభిప్రాయం…
దీనికి కారణం ఆ సినిమాలకు ప్రొడ్యూసర్…అయిన c. కళ్యాణ్… ఆయన రవి శత్రువులైన సూరి, భాను ప్రకాష్ లకు బినామీ అని, అందువల్ల రవి ని విలన్గా చూపించారు అని బయట ప్రపంచంలో… చాలా మంది అనుకునే బహిరంగ రహస్యం…
కాబట్టి… ఇక్కడ RGV అనే రచయిత/దర్శకుడు…ఒకటి అప్పటికి బతికున్న… సూరి, భాను ప్రకాశ్ లకు భయపడి తీసుండాలి… లేదా… వాళ్లు ఇచ్చిన డబ్బులకు ఆశపడి రవి ని విలన్ గా చూపించి ఉండాలి…
వంగవీటి కూడా ఆ కోవకు చెందినదే….
ఇక నిన్న వచ్చిన సావిత్రి గారి జీవితాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన మహానటి..
ఇప్పటికి ఉన్న సావిత్రి గారి అభిమానులను దృష్టిలో పెట్టుకొని… సావిత్రి ని గొప్పగా చూపిస్తూ… గణేషన్ ని విలన్ గా చూపించారు
ఆమె కథ ని రచయిత వెతుకుతూ వెళ్లిన క్రమంలో ఎవరైనా ఆమె గురించి చెడుగా చెప్పినా రచయిత చూపించే ధైర్యం చేయడు… చేయలేదు… కూడా.. ఒక వేళ అది నిజమే అనిపించినా…
(ఆమె గురించి నెగిటివ్ గా జెమినీ మొదటి భార్య పిల్లలు మాట్లాడారు… యూట్యూబ్ లో చూడచ్చు)
ఎందుకంటే… ఆ రచయిత/డైరెక్టర్ దృష్టిలో సావిత్రి గొప్పగా అనుకోవడం ఒకటి…
తనని చెడుగా చూపిస్తే… విమర్శల పాలవుతాం… అనే భయం కావచ్చు…
లేదా… ఆ సినిమా ప్రొడ్యూసర్స్… ఆమె జీవితాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ విషయాలు బయటకి రాకపోవడం అనేది కూడా… కావొచ్చు…
ఇవన్ని పక్కన పెడితే… సావిత్రి గారి సినిమా అసలు ఎలా చూపిస్తారు.. అని ఎదురుచూసిన అందరికి … దర్శకుడు చూపించిన తెలివితేటలు… అందరి ఊహలను దాటి వెళ్లాయి…ఏ సినిమా కైనా మొదట ట్రైలర్ రిలీజ్ ఉంటుంది… కానీ మహానటి కి లేదు… ఇక్కడ దర్శకుడు… తన తెలివితేటలతో 40 ఇయర్స్ సినిమా హిస్టరీ ఉన్న అశ్వనీదత్ కూడా… ఊహించనటువంటి గొప్ప విజయాన్ని ఇచ్చాడు…
ఫైనల్… గా అసలు విషయం
ఎన్టీఆర్ గారి బయోపిక్ విషయానికొస్తే…
బయోపిక్ అనగా.. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి మరణించేవరకు…ఆ వ్యక్తి యొక్క జీవితం లో ఉన్న ముఖ్యమైన కోణాలన్నీ చూపించడమే బయోపిక్ యొక్క అర్థం. ఇక్కడ ఎన్టీఆర్ గారు.. నాటకాలు వేస్తూ… సినిమా ల కోసం ప్రయతిస్తూ… హీరో గా… మహానటుడు గా ఎదిగిన క్రమం నుండి… ఆయన రాజకీయ జీవితం… చివరి క్రమంలో జరిగిన అన్నీ ముఖ్య విషయలు కూడా చూపించాలి…
అలా… చూపించాలి అంటే…
రాజకీయాల్లో కి వచ్చి పార్టీ పెట్టిన తర్వాత
కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు… ఎన్టీఆర్ రాజకీయాలకు పనికి రాడు… అని అన్న మాటలు చూపించాలి…రాయలసీమ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కార్ మీద విసిరిన చెప్పులు చూపించాలి…ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా గెలిచాక… చంద్రబాబు ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి పార్టీ లోకి వచ్చి మంత్రి అయిన విధానం చూపించాలి…తరువాత ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకోవడం..
ఆరోగ్య సమస్యలతో… అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి…కొడుకులు, కూతుర్లు… తొడల్లుళ్ళ… సహాయం తో ఎమ్మెల్యే లను మూట గట్టుకొని… వైస్రాయ్… హోటల్ సాక్షిగా వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ ని దింపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన విధానం చూపించాలి… మరి ఇవి అన్ని చూపిస్తారా అన్నది సందేహమే. క్రిష్ అంత సాహసం చేస్తాడా లేక బాలకృష్ణ చూపించాలి అనుకున్నదే చూపిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here