ఎన్ని సినిమాలు చేస్తావ్ చైత‌న్య‌..?

Naga Chaitanya Indraganti

ఓ వైపు భార్య స‌మంత వ‌రస విజ‌యాల‌తో దూసుకుపోతుంటే నాగ‌చైత‌న్య కూడా ఆమెకు పోటీగా పోటెత్తుతున్నాడు. వ‌రస సినిమాలు ఒప్పుకుని విజ‌యాల కోసం కృషి చేస్తున్నాడు. ఇమేజ్ పెంచుకుని మార్కెట్ తెచ్చుకోవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని విజ‌యాలు వ‌చ్చినా కూడా 30 కోట్ల మార్క్ అందుకోలేదు చైతూ. మ‌నం అందుకున్నా.. అందులో నాగార్జున కూడా ఉన్నాడు. పైగా ఏఎన్నార్ కు అది చివ‌రి సినిమా. దాంతో సోలోగా 30 కోట్ల మార్క్ కోసం ప‌రిగెడుతున్నాడు ఈ హీరో.

ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ చిత్రం జులైలో విడుద‌ల కానుంది. ఇది న‌డుస్తుండ‌గానే మారుతితో శైల‌జారెడ్డి అల్లుడు కూడా మొద‌లుపెట్టాడు నాగ‌చైత‌న్య‌. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు నిన్నుకోరి ఫేమ్ శివ‌నిర్వాణ‌తో ఓ సినిమా క‌మిట‌య్యాడు చైతూ. ఇందులో భార్య స‌మంతతో క‌లిసి న‌టించ‌బోతున్నాడు నాగ‌చైత‌న్య‌. పెళ్లైన త‌ర్వాత వీళ్లు చేయ‌బోయే తొలి సినిమా ఇదే.

దానికితోడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మేన‌మామ వెంక‌టేశ్ తో వెంకీమామ అంటూ మల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు ఈ మేన‌ల్లుడు. ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు మ‌రో సినిమా కూడా వ‌చ్చి నాగ‌చైత‌న్య ఖాతాలో చేరిపోయింది. అదే ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ సినిమా. ఈ ద‌ర్శ‌కుడు కూడా త‌ను చైతూతో సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సుధీర్ బాబుతో స‌మ్మోహ‌నం అంటూ కాస్త పెద్ద సినిమానే చేసాడు. జూన్ 15న రిలీజ్ కానుంది ఇది. ఇది విడుద‌ల కాక‌ముందే త‌ర్వాతి సినిమా నాగ‌చైత‌న్య‌తో అని చెప్పేసాడు ఇంద్ర‌గంటి.

నిజానికి స‌మ్మోహ‌నం కంటే ముందే ఈ ద‌ర్శ‌కుడితో చైతూ సినిమా చేయాలి కానీ అప్పుడు స‌వ్య‌సాచితో పాటు మారుతి సినిమాకు కూడా క‌మిట్ మెంట్ ఉండ‌టంతో ఇంద్ర‌గంటికి డేట్స్ ఇవ్వ‌లేక‌పోయాడు ఈ హీరో. దాంతో ఇప్పుడు చేస్తానంటున్నాడు మోహ‌న‌కృష్ణ‌. సెన్సిబుల్ సినిమాలు తీయ‌డంలో ఆరితేరిపోయిన ఇంద్ర‌గంటికి నాగ‌చైత‌న్య లాంటి క్రేజీ హీరో ప‌డితే మార్కెట్ రేంజ్ కూడా పెరిగిపోతుంది. మొత్తానికి చందూమొండేటి.. మారుతి.. బాబీ.. శివ‌నిర్వాణ‌.. ఇంద్ర‌గంటి.. ఇలా ఇంత‌మంది ద‌ర్శ‌కుల‌ను లైన్ లో పెట్టాడు నాగ‌చైత‌న్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here