ఎమ్మెల్యే కొత్త‌గా ఉన్నాడు..!

Nandamuri Kalyan Ram Kajal Aggarwal's MLA in March
కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తున్న‌పుడు తెలియ‌కుండానే సినిమాకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ వ‌చ్చేస్తుంది. వాళ్ళ క‌సి మొత్తం సినిమాలో క‌నిపిస్తుంటుంది. క‌ళ్యాణ్ రామ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఆ మ‌ధ్య ప‌టాస్ తో అనిల్ రావిపూడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసాడు ఈ హీరో. ఈ సినిమాకు అత‌డే ప్ల‌స్ అయ్యాడు. క‌థ పాత‌దే అయినా ట్రీట్ మెంట్ మాత్రం అదిరిపోయేలా ఇచ్చాడు అనిల్. ఇప్పుడు ఉపేంద్ర మాధ‌వ్ అనే మ‌రో ద‌ర్శ‌కున్ని ప‌రిచ‌యం చేస్తున్నాడు ఈ హీరో. ఈయ‌న‌తోనే ఎమ్మెల్యే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సంక్రాంతి సంద‌ర్భంగా ఎమ్మెల్యే టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో ప్ర‌చారం చేస్తూ బాగానే సందడి చేసాడు క‌ళ్యాణ్ రామ్.
ఈనాడు.. వార్త‌.. ఆంధ్ర‌జ్యోతి.. న‌మ‌స్తే తెలంగాణ అంటూ న్యూస్ పేప‌ర్స్ అన్నీ వాడేసాడు ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్. టీజ‌ర్ బాగానే ఉంది. క‌చ్చితంగా ఈ చిత్రంతో మ‌రో హిట్ కొట్టేలా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో త‌న ట్యాప్ గుర్తుకే ఓటేయండి అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టాడు నంద‌మూరి హీరో. యిజం త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇదే. ఎమ్మెల్యే అంటే మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అంటున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఓ రాజ‌కీయ నాయకుడిని స‌వాల్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలా గెలుస్తాడ‌నేది క‌థ‌గా తెలుస్తోంది. మార్చ్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. కాజ‌ల్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ల‌క్ష్మీక‌ళ్యాణం త‌ర్వాత ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇదే. మ‌రి చూడాలి.. క‌ళ్యాణ్ రామ్ కు రాజ‌కీయాలు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here