ఎమ్మెల్యే బ్యాలెట్ బాగానే నిండిందే..!

 
 
Nandamuri Kalyan Ram Kajal Aggarwal's MLA in March
బ్యాలెట్ నిండ‌టం అంటే క‌లెక్ష‌న్లు అని అర్థం. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమా కదా.. అందుకే మ‌నం కూడా పొలిటిక‌ల్ భాష‌లోనే మాట్లాడుకుందాం.
ఎమ్మెల్యే సినిమాకు తొలిరోజు క‌లెక్ష‌న్లు బాగానే వ‌చ్చాయి. సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్లు మాత్రం బానే వ‌చ్చాయి. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్య‌స్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఎమ్మెల్యే. తొలిరోజు 5.3 కోట్ల గ్రాస్ వ‌చ్చింది.
అంటే దాదాపు 3 కోట్ల షేర్ వ‌చ్చిన‌ట్లే లెక్క‌. క‌ళ్యాణ్ రామ్ గ‌త సినిమాల్లో ఏదీ ఈ స్థాయి ఓపెనింగ్స్ తీసుకురాలేదు. దీన్నిబ‌ట్టి ఎమ్మెల్యేతో క‌ళ్యాణ్ మార్కెట్ పెరిగిన‌ట్లే లెక్క‌. పూరీ జ‌గ‌న్నాథ్ తో చేసిన యిజం సినిమాకు కూడా ఓపెనింగ్స్ త‌క్కువే వ‌చ్చాయి.
అయితే ఎమ్మెల్యేకు ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చినా.. టాక్ మాత్రం తేడాగా ఉంది. ఈ టాక్ తో మూడు రోజుల వ‌ర‌కు ఓకే కానీ సినిమా సేఫ్ అవ్వాలంటే మాత్రం 15 కోట్లు రావాలి. మ‌రి అంత దూరం ప్ర‌యాణిస్తుందా.. ఈ ఎమ్మెల్యేకు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌డ‌తారా.. త‌మ మ‌ద్ద‌తు తెలుపుతారా అనేది ఆస‌క్తిక‌ర‌మే. చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఎమ్మెల్యే ప్ర‌యాణం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here