ఎమ్మెల్యే బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మే..!

   


క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో మ‌రో యావ‌రేజ్ సినిమా వ‌చ్చి చేరుతుందా..? ఎమ్మెల్యే కూడా ఈ నంద‌మూరి హీరో ఆశ‌ల్ని తీర్చ‌డం లేదా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయిని ప్రేక్ష‌కులు అంత‌గా రిసీవ్ చేసుకున్న‌ట్లు అనిపించ‌డం లేదు. ఎమ్మెల్యే ఓపెనింగ్స్ ప‌ర్లేదు కానీ ఫుల్ ర‌న్ క‌లెక్ష‌న్ల‌లో మాత్రం న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 15 కోట్లు రావాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో వ‌చ్చింది 8 కోట్లు మాత్ర‌మే. గ‌తంలో క‌ళ్యాణ్ రామ్ ఇమేజ్ తో పోలిస్తే ఇవి ఎక్కువ వ‌సూళ్లే. కానీ సినిమా సేఫ్ అవ్వ‌డానికి ఇది స‌రిపోదు. ఎందుకంటే మ‌రో రెండు రోజుల్లో రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. అది వ‌స్తే క‌చ్చితంగా థియేట‌ర్స్ క్లీన్ స్వీప్ త‌ప్ప‌దు. సినిమాకు కానీ పాజిటివ్ టాక్ వ‌స్తే క‌చ్చితంగా ఎమ్మెల్యే ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. అలా కాదంటే రెండో వారం కూడా బ‌తికిపోతుంది. ఇప్పుడు క‌ళ్యాణ్ జాత‌కం చ‌ర‌ణ్ చేతుల్లో ఉంద‌న్న‌మాట‌. పైగా ఎంట‌ర్ టైన్మెంట్ బాగానే ఉండ‌టం.. కాజ‌ల్ అందాలు ఎమ్మెల్యేకు హెల్ప్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్ప‌ట్నుంచీ ఎమ్మెల్యే ప్ర‌యాణ‌మే ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఎమ్మెల్యే ద‌రి చేరాలంటే మ‌రో 8 కోట్లు రావాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం. మ‌రి చూడాలిక‌.. ఎమ్మెల్యే ఎలాంటి అద్భుతం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here