ఎమ్మెల్యే సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180323

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: ఎమ్మెల్యే
న‌టీన‌టులు: క‌ళ్యాణ్ రామ్, కాజ‌ల్, ర‌వికిష‌న్, పోసాని త‌దిత‌రులు
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ఉపేంద్ర మాధ‌వ్
ఎమ్మెల్యే అంటే మ‌న‌కు ఇన్నాళ్లూ గుర్తొచ్చేది రాజ‌కీయ నాయ‌కులే. కానీ ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ గుర్తొస్తున్నాడు. ఈ పేరుకు అంత‌గా ఫిక్స్ అయిపోయాడు ఈయ‌న‌. తాజాగా ఎమ్మెల్యే టైటిల్ తో సినిమా కూడా చేసాడు. మ‌రి క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాలు ఎంత‌వ‌ర‌కు ప‌నికొచ్చాయి..? ప‌్రేక్ష‌కుల‌కు న‌చ్చాయా లేదా..? అనేది అస‌లు క‌థ‌.
క‌థ‌:
క‌ళ్యాణ్(క‌ళ్యాణ్ రామ్) ఓ ఎమ్మెల్యే. అంటే మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అని అర్థం. ఎవ‌రికి క‌ష్ట‌మొచ్చినా త‌న క‌ష్టంలాగే ఫీలవుతుంటాడు. అలాంటిది త‌న చెల్లికే అనుకోని క‌ష్టం వ‌స్తుంది. త‌ను ప్రేమించిన అబ్బాయి(వెన్నెల కిషోర్)కు పెళ్లి అవుతుంటే.. చెల్లి(లాస్య‌)ను తీసుకెళ్లి ప్రేమ పెళ్లి చేస్తాడు. అది వాళ్ల ఇంట్లో వాళ్ల‌కు న‌చ్చ‌దు. దాంతో బెంగ‌ళూర్ కు చెల్లి, బావ‌తో పాటు వెళ్తాడు క‌ళ్యాణ్. అక్క‌డే యిందు(కాజ‌ల్) తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ త‌ర్వాత త‌ను ప‌ని చేస్తోన్న కంపెనీ ఛైర్మెన్ కూతురు యిందు అని తెలుసుకుని షాక్ అవుతాడు క‌ళ్యాణ్. అంత‌లోనే ఆమెపై ఓ కిడ్నాపింగ్ ఎపిసోడ్ జ‌రుగుతుంది. అప్పుడే యిందు గ‌తం గురించి తెలుసుకుని షాక్ అవుతాడు క‌ళ్యాణ్. అస‌లు యిందు ఎవ‌రు..? ప‌్రేమిస్తోన్న క‌ళ్యాణ్ ని కూడా కాద‌ని ఎందుకు అత‌న్ని మోసం చేస్తుంది..? అస‌లు మ‌ధ్య‌లో ఎమ్మెల్యే గాడ‌ప్ప‌(ర‌వికిష‌న్) ఎందుకొచ్చాడు..? ఎందుకు క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అనేది మిగిలిన క‌థ‌.
క‌థ‌నం:
ఎవ‌రెన్ని చెప్పినా.. ఎంత కొత్త‌గా ట్రై చేసినా.. పాత క‌థ‌లు మాత్రం ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అలాగే ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాను వ‌దిలేసి మ‌న హీరోలు ఉండ‌లేరు. ఆరు పాట‌లు.. నాలుగు ఫైట్లు.. మూడు కామెడీ సీన్లు.. రొటీనే కావ‌చ్చు.. కానీ న‌చ్చేలా చెప్తే మ‌ళ్లీ క‌న్విన్స్ అవుతారు ప్రేక్ష‌కులు. అందుకే రిస్క్ తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడాడు కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్. ఎక్క‌డా కొత్త‌ద‌నం అనే మాటే లేకుండా సాగే రొటీన్ ప్ర‌య‌త్న‌మే ఈ ఎమ్మెల్యే. ప‌టాస్ రేంజ్ లో ఊహించుకుని వెళ్తే క‌చ్చితంగా నిరాశ త‌ప్ప‌దు. కానీ ఈ ఎమ్మెల్యేలో కూడా ఆక‌ట్టుకునే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన అంశాల‌న్నింటినీ లెక్క‌లేసుకుని ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. తెలిసిన క‌థే కాబ‌ట్టి ఇంకాస్త ఎంట‌ర్ టైన్మెంట్ ఉండుంటే బాగున్ను అనిపిస్తుంది. బ్ర‌హ్మానందం ఉన్నా పెద్ద‌గా ఇంపాక్ట్ క‌నిపించ‌దు. ఆయ‌న సీన్ చాలా ఫ‌న్నీగా అనిపిస్తుంది. కానీ ప‌ర్లేద‌నిపించాడు ద‌ర్శ‌కుడు త‌న తెలివితో. కానీ కంటెంట్ తెలిసిన త‌ర్వాత ఎమోష‌న్ పై క‌థ న‌డిచిపోతుంది.. ఫ‌స్టాఫ్ సోసోగా అనిపించినా.. సెకండాఫ్ లోనే అస‌లు క‌థ ఉంది. హీరో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నామినేష‌న్ సీన్ బాగా వ‌ర్క‌వుట్ అయింది. హీరో కాబ‌ట్టి ఎమ్మెల్యే అయ్యాడు అని కాకుండా.. దానికోసం అత‌డు చేసిన ప‌నులు బాగా చూపించాడు. క‌మ‌ర్షియ‌ల్ పంథాలోనే కాస్త పొలిటిక‌ల్ మైండ్ గేమ్ ఆడించాడు ద‌ర్శ‌కుడు ఉపేంద్ర‌. పోలింగ్ ఇప్పుడే మొద‌లైంది క‌దా.. మ‌రి బ్యాలెట్ బాక్సులు నిండుతాయా లేదా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.
న‌టీన‌టులు:
క‌ళ్యాణ్ రామ్ చాలా బాగా న‌టించాడు. ఈయ‌న న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నేముంది. ప‌టాస్ త‌ర్వాత మ‌రోసారి అదే జోష్ చూపించాడు ఈ హీరో. ఇక స్టైలింగ్ లో.. క్యాస్ట్యూమ్స్ లో.. లుక్స్ విష‌యంలో చాలా కొత్తగా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. కాజ‌ల్ ఉన్నంత‌లో బాగా చేసింది. ఈమె పాత్ర కూడా క‌థ‌లో కీల‌కం ఏం కాదు. పాట‌ల‌కు మాత్ర‌మే ఉన్న‌ట్లుంది. ర‌వికిష‌న్ విల‌న్ గా ఓకే. పోసాని ఫ‌స్టాఫ్ లో కామెడీని బాగానే మోసాడు. ఇక వెన్నెల కిషోర్, లాస్య లాంటి వాళ్లంతా త‌మ పాత్ర‌ల పరిధి మేర‌కు బాగానే చేసారు.
టెక్నిక‌ల్ టీం:
మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న రోటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ అయితే మ‌రీ రొటీన్ గా ఉంది. ముఖ్యంగా క‌ళ్యాణ్ రామ్ క‌త్తి.. అత‌నొక్క‌డే లాంటి సినిమాల్లో ఇచ్చిన ఆర్ఆర్ మ‌ళ్లీ కొట్టాడు. ఇక సినిమాటోగ్ర‌ఫీ పర్లేదు. ప్ర‌సాద్ మూరెళ్ల ఫారెన్ అందాల‌ను బాగానే చూపించాడు. త‌మ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్క‌డా పెద్ద‌గా బోర్ సీన్స్ ఏవీ లేవు కానీ పాత క‌థ కాబ‌ట్టి ఆ ఫీలింగ్ వ‌స్తుందంతే. ఇక ద‌ర్శ‌కుడిగా ఉపేంద్ర మాధ‌వ్ తొలి సినిమాకు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేసాడు. డైలాగ్స్ విష‌యంలో బాగా రాసుకున్నాడు. ఓవ‌రాల్ గా ఎమ్మెల్యే ఓ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌య‌త్నం.
చివ‌ర‌గా:
ఎమ్మెల్యే.. రొటీన్ అబ్బాయే కానీ మంచి ల‌క్ష‌ణాలున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here