ఎల్లో ఎల్లో.. కాజ‌ల్ పిచ్చెక్కించింది మ‌ల్లో..!


ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే ఇలాంటి పాట ఒక‌టి రాసి పాడాల‌నిపిస్తుంది క‌దా..! ఎల్లోలో హాయిగా పిచ్చెక్కిస్తుంది చంద‌మామ‌. సినిమాల్లో ఎంత గ్లామ‌ర్ ఒల‌క‌బోసినా కూడా బ‌య‌ట మాత్రం ప‌ద్ద‌తిగా క‌నిపిస్తుంటుంది కాజ‌ల్. కానీ కెరీర్ చ‌ర‌మాంకానికి వ‌చ్చింది క‌దా.. అందుకే పోటీ త‌ట్టుకోలేక‌పోతుందేమో మ‌రి..? ఈ మ‌ధ్య బ‌య‌ట కూడా గ్లామ‌ర్ షోలు మొద‌లుపెట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలా ఎల్లో గ్లామ‌ర్ షో. థైస్ క‌నిపించేలా పిచ్చెక్కిస్తుంది చంద‌మామ‌. ఈ భామ ప్ర‌స్తుతం క్వీన్ షూటింగ్ లో ఉంది. మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే ప్ర‌మోష‌న్ కోసం తిరిగిన కాజ‌ల్.. ఇప్పుడు మ‌ళ్లీ బిజీ అయిపోయింది. బ‌య‌ట క‌నిపించిన‌పుడ‌ల్లా ఇదిగో ఇలా చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో థైస్ చూపిస్తూ వేడి రాజే స్తుంది కాజ‌ల్.
ఆ మ‌ధ్య బాలీవుడ్ మోజులో ప‌డి కాస్త డోస్ పెంచేసిన చంద‌మామ‌.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఎమ్మెల్యేలో బాగానే అందాలు ఆర‌బోసింది ముద్దుగుమ్మ‌. సినిమాలోనే కాదు బ‌య‌ట కూడా ఇలాగే హ‌ద్దులు చెరిపేస్తూ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. చంద‌మామ హాట్ షోతో ఎమ్మెల్యే ఓపెనింగ్స్ కూడా బాగానే వ‌చ్చాయి. గ‌తేడాది వివేగం, నేనేరాజు నేనేమంత్రి సినిమాల్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ భామ‌.. మెర్స‌ల్ లో బాగానే అందాలు ఆర‌బోసింది. ఇక ఈ మ‌ధ్యే ఫోటోషూట్ ల‌లో కూడా దూకుడు చూపిస్తుంది కాజ‌ల్. మొత్తానికి ఈమె అందాల ఆర‌బోత చూస్తుంటే మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాల‌ని ఫిక్సైపోయింది. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే బెల్లంకొండ కొత్త సినిమాలో హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది కాజ‌ల్. ఈ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది చంద‌మామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here