ఏం ప్లానింగ్ రాజుగారు..!

Dil Raju
దిల్ రాజు.. ఇప్పుడు ఈ పేరుకు హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఓ నిర్మాత‌కు ఇంత‌గా క్రేజ్ ఉండటం మ‌న ఇండ‌స్ట్రీలో అస్స‌లు జ‌ర‌గ‌దు. అది ఇప్పుడు ఉన్న టైమ్ లో. హీరోలే రాజ్య‌మేలుతున్న టైమ్ లో త‌న‌కంటూ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు రాజు. ఆయ‌న త‌లుచుకోవాలే కానీ ఇండ‌స్ట్రీలో ఏ హీరో డేట్స్ లేవ‌ని చెప్ప‌డు. మ‌నోడి టైమ్ అలా న‌డుస్తుంది ఏం చేస్తాం మ‌రి..! ఓ ప‌క్క హీరోల డేట్స్ సంపాదించుకోడానికి ఇత‌ర నిర్మాత‌లు నానా తంటాలు ప‌డుతుంటే.. దిల్ రాజు మాత్రం ఈజీగా అంద‌రి డేట్స్ ప‌ట్టేస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో ఉన్న కుర్రాళ్లంతా రాజుగారిగ‌దిలోనే ఉన్నారు. కావాలంటే చూడండి.. గ‌తేడాది ఆరు సినిమాల‌తో వ‌చ్చి అన్నీ విజ‌యాలు అందుకున్నాడు.
2017 మాదిరే 18ని కూడా త‌న డైరీలో రాసుకోవాల‌ని చూస్తున్నాడు దిల్ రాజు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా విడుద‌ల చేయ‌లేదు దిల్ రాజు. ముందుగా రాజ్ త‌రుణ్ తో ఈ ఏడాది ఆట స్టార్ట్ చేయ‌బోతున్నాడు రాజు. జులైలో ఈయ‌న బ్యాన‌ర్ నుంచి రాజ్ త‌రుణ్ ల‌వర్ సినిమా రానుంది. అనీల్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా జ‌రుగుతుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఆగ‌స్ట్ 3న నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణం రానుంది. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం చంఢీఘ‌ర్ లో జ‌రుగుతుంది. స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడు. ఇక హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు కూడా ఇదే ఏడాది మొద‌లు కానుంది. ఈ చిత్రంలో నితిన్, శ‌ర్వానంద్ హీరోలుగా న‌టించనున్నారు. రామ్ ను కూడా ఏడేళ్ల త‌ర్వాత త‌న కంపౌండ్ లోకి ఆహ్వానించాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన‌తో రామ్ చేస్తోన్న హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. అంటే జులైలో ల‌వర్.. ఆగ‌స్ట్ లో శ్రీ‌నివాస క‌ళ్యాణం.. సెప్టెంబ‌ర్ లో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే విడుద‌ల కానున్న‌యన్న‌మాట‌.
వీటితో పాటు వ‌రుణ్ తేజ్-వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో రానున్న ఎఫ్ 2 జూన్ లో ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రం దాదాపు ఇదే ఏడాది విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. అన్నీ కుదిర్తే డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి చూస్తున్నాడు. ఇక మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి సినిమా కూడా జూన్ లో ప‌ట్టాలెక్కి.. డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేసేలా స‌న్నాహాలు చేస్తున్నాడు. ఎందుకంటే డిసెంబ‌ర్ నుంచి సుకుమార్ సినిమాతో బిజీ అవుతాన‌ని మ‌హేశ్ బాబు స్వ‌యంగా చెప్పాడు. సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ తో క‌లిసి వంశీ పైడిప‌ల్లి సినిమాను నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇక కొత్త ద‌ర్శ‌కుడు శ‌శితో అదేనువ్వు అదేనేను సినిమా అనౌన్స్ చేసాడు దిల్ రాజు. ఇలా 2017 కాదు.. 18 కూడా పూర్తిగా రాజుగారి కంట్రోల్ లోనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here