ఏం మంత్రం వేయ‌లేక‌పోయాడు.. 

Ye Mantram Vesave
ఊహించిందే నిజ‌మైంది.. అనుకున్న‌దే జ‌రిగింది.. నాలుగేళ్ల కింద షూటింగ్ పూర్తైన సినిమాను ఇప్పుడు విడుద‌ల చేస్తే ఎవ‌రూ ప‌ట్టించుకోరని తెలుసు.. అందుకే త‌న సినిమా అని తెలిసినా విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు దాని ఫ‌లితం తెలిసిపోయింది. ఒక్క షోతోనే సినిమా రేంజ్ ఏంటో అర్థ‌మైపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ‌ధ‌ర్ మ‌ర్రి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సినిమా ఏం మంత్రం చేసావే. 2014లో మొద‌లైన ఈ చిత్రం 2015 నుంచి 17 వ‌ర‌కు షూటింగ్ జ‌రుపుకుంది. ఈ మూడేళ్ల‌లో విజ‌య్ దేవ‌రకొండ రేంజ్ కూడా చాలా మారిపోయింది. ఒక‌ప్పుడు ఈయ‌న సినిమాలు ఎవ‌రు విడుద‌ల చేస్తారా అని చూసేవాళ్లు.. కానీ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి త‌ర్వాత మేం చేస్తాం మేం చేస్తామంటూ వెంట‌ప‌డుతున్నారు. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో రాకూడ‌ని సినిమా ఏం మంత్రం చేసావే. విజ‌య్ కు ఎంత ఇమేజ్ ఉన్నా ఈ సినిమాను క‌నీసం త‌ను ప‌ట్టించుకోలేదు. అది ఎలాగూ ఆడ‌దు అని ముందే ఫిక్సైపోయాడో ఏమో కానీ క‌నీసం ప్ర‌మోష‌న్స్ కు కూడా రాలేదు. ఇది ఇప్ప‌టి సినిమా కాదు.. దీంతో నాకెలాంటి సంబంధం లేదు అని ప్రేక్ష‌కుల ముందు నుంచే త‌న ప‌నుల‌తో హింట్ ఇచ్చాడు విజ‌య్. ఏం మంత్రం చేసావే విడుద‌లైనా కూడా త‌న ప‌ని తాను చూసుకుంటున్నాడు ఈ హీరో. ఇప్పుడు అనుకున్న‌ట్లుగానే తొలి షోకే సినిమాకు టాక్ తేడాగా వ‌చ్చేసింది. అయితే ఏదేమైనా.. ఎన్ని చేసినా.. సినిమా ఫ్లాప్ అయితే అది ప‌డేది మాత్రం విజ‌య్ కెరీర్ లోనే. ఇప్పుడు ఈయ‌న ఫ్లాప్ హీరోనే. మ‌ళ్లీ ట్యాక్సీవాలాతో పాటు ప‌రుశురామ్ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఫ్లాప్ హీరోనే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here