ఏక్ దో తీన్ అదిరిపోయిందిగా.. 


ఈ మ‌ధ్య బాలీవుడ్ లో చాలా పాట‌ల‌ను రీమిక్స్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు ట్రెండ్ సెట్ చేసిన పాట‌ల‌ను ఇప్పుడు ఈజీగా వాడేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హ‌మ్మ హ‌మ్మ‌.. త‌మ్మ త‌మ్మ‌.. తూ ఛీజ్ బ‌డీ హై మ‌స్త్  మ‌స్త్.. హ‌వా హ‌వా.. ఇలా ఒక్కో హీరో ఒక్కో పాట‌తో చంపేస్తున్నాడు. ఇక ఇప్పుడు మ‌రో పాట‌ను కూడా రీమిక్స్ చేసారు. అదే ఏక్ దో తీన్. ఈ పాట విన‌గానే అంటే మ‌రో మాట లేకుండా గుర్తొచ్చే పేరు మాధురి దీక్షిత్. అప్ప‌ట్లో తేజాబ్ సినిమాలో అమ్మాయిగారు వేసిన చిందుల‌కు ఇండియా మొత్తం కాలు క‌దిపింది. 90ల్లో యూత్ ను నిద్ర కూడా పోనీయ‌లేదు ఈ పాట‌. ఎంతోమందికి క‌ల‌ల రాణిగా మారిపోయింది ఈ పాట‌తో. ఏక్ దో తీన్ పాట‌తో డాన్సింగ్ సెన్సేష‌న్ అంటూ ముద్దుపేరు ఇచ్చేసారు ఈ ముద్దుగుమ్మ‌కు. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఈ పాట‌ను భాగీ 2 కోసం రీమిక్స్ చేసారు.
న‌యా ఏక్ దో తీన్ లో శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్ చిందేసింది. తాజాగా ఈ పాట నిమిషంన్న‌ర టీజ‌ర్ విడుద‌లైంది. క్ష‌ణం ఫ్రీమేక్ గా భాగీ 2 వ‌స్తుంది. మార్చ్ 30న ఈ చిత్రం విడుద‌ల కానుంది. టైగ‌ర్ ష్రాఫ్, దిశాప‌టానీ జంట‌గా న‌టించారు. రెండు నిమిషాల పాట‌లో స్టెప్స్ కుమ్మేసింది ఈ బ్యూటీ. అన్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ లో పాత పాట‌ల్ని బాగానే రీమిక్స్ చేస్తున్నారు. ప్ర‌తీ పాట కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ అందుకుం టుంది. ఎవ‌రికి వారు త‌మ‌కు కావాల్సిన పాట‌ల‌ను కావాల్సినట్లుగా రీమిక్స్ చేసుకుంటున్నారు. చేస్తే చేసారు కానీ ఆ పాట‌ల‌ను చెడ‌గొట్ట‌క‌పోతే చాలంటున్నారు అభిమానులు. ఇప్ప‌టి వ‌ర‌కైతే ఈ పాట‌ను చేసి చెడ‌గొట్టారు అనే ఊహైతే ఏ పాట‌కు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here