అర్జున్ రెడ్డిని ఫాలో అవుతున్న అల్లుఅర్జున్..


అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు అర్జున్ రెడ్డినే ఫాలో అవుతున్నాడు అల్లుఅర్జున్. అది కూడా త‌న సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో ప‌క్కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను దించేస్తున్నాడు బ‌న్నీ. ఆయ‌న అర్జున్ రెడ్డి కోసం ఏదైతే చేసాడో ఇప్పుడు త‌న నా పేరు సూర్య సినిమా కోసం కూడా అదే చేస్తున్నాడు అల్లు వార‌బ్బాయి. అప్ప‌ట్లో అర్జున్ రెడ్డి సినిమా కోసం రాష్ట్రంలోని మెడిక‌ల్ కాలేజ్ లు తిరిగాడు విజ‌య్.
ఎందుకంటే ఆ సినిమా మెడిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది కాబ‌ట్టి. అందుకే ముందు మెడిక‌ల్ కాలేజ్ స్టూడెంట్స్ ను ఆక‌ట్టుకున్నాడు విజ‌య్. ఇప్పుడు బ‌న్నీ కూడా ఇదే చేస్తున్నాడు. త‌న సినిమా మిల‌ట్రీ కాబ‌ట్టి అదే ఫాలో అవుతున్నాడు. అయినా ఈ రోజుల్లో సినిమాను ఎలా తీస్తున్నాం అని కాదు.. ఎంత బాగా ప్ర‌మోట్ చేస్తున్నాం అనేది చూస్తున్నారంతా. ఈ విష‌యంలో బ‌న్నీ అండ్ టీం చాలా అలెర్ట్ గా ఉన్నారు. తాజాగా బ‌న్నీ న‌టిస్తున్న నా పేరు సూర్య మిల‌ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా.
ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు బ‌న్నీ. సాధార‌ణంగా ఇలాంటి సినిమాలు జ‌నాల్లోకి వెళ్ల‌డానికి కాస్త టైమ్ ప‌డుతుంది. అందుకే తానే జ‌నాల ద‌గ్గ‌రికి వెళ్తున్నాడు అల్లుఅర్జున్. మిల‌ట‌రీ కాబ‌ట్టి ఈ చిత్ర ఆడియో వేడుక‌ను మిల‌ట్రీ మాధ‌వ‌రంలో ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు. ఎక్క‌డో వెస్ట్ గోదావ‌రిలో తాడేప‌ల్లిగూడెంకు ద‌గ్గ‌ర్లో ఉండే ఈ ఊళ్లో ప్ర‌తీ ఇంటికి కూడా ఓ జ‌వాన్ ఉన్నాడు. దాంతో దేశ‌భ‌క్తి నేప‌థ్యం ఉన్న సినిమా కాబ‌ట్టి ఈ ఊళ్లోని పెద్ద‌ల‌తోనే పాట‌లు విడుద‌ల చేయ‌డం మంచిది అని భావిస్తున్నాడు బ‌న్నీ.
దాంతో చిత్ర‌యూనిట్ తో పాటు తాను కూడా ఎప్రిల్ 22న మాధ‌వ‌రం వెళ్లి అక్క‌డే ఆడియో వేడుక జ‌ర‌ప‌నున్నాడు. ఆ త‌ర్వాత ఎప్రిల్ 29న హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుక భారీగా జ‌ర‌ప‌బోతున్నారు. మొత్తానికి సినిమా థీమ్ కు త‌గ్గ‌ట్లు వెళ్తూ అంచ‌నాలు పెంచేస్తున్నాడు అల్లుఅర్జున్. ఈ చిత్రం మే 4న విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here