ఏప్రిల్ 29న “నా పేరు సూర్య” ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చ‌ర‌ణ్‌-ఆర్జున్‌, మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు ఏ స‌ర్టిఫికేట్ తో మే 4 న సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

గ‌చ్చిబౌలి స్టేడియంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా అత్య‌థిక మెగాఅభిమానుల స‌మ‌క్షంలో, అత్యంత గ్రాండ్ గా నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గా గ్రాండ్ గా చేస్తున్నారు.. ఈ ఫంక్ష‌న్ కి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హ‌జ‌ర‌వుతుండ‌గా.. మ‌రికొన్ని స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ‌స్ వున్నాయి. ఏప్రిల్ 29న ఈ ఫంక్ష‌న్ గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here