ఐతే 2.0` సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎం.ఎం.కీర‌వాణి


ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.ఓ’. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో `నింగిపై…` అనే పాట‌ను ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి విడుద‌ల చేశారు. ఈ కార్య్ర‌క‌మంలో ఇంకా క‌ల్యాణ్ మాలిక్‌, చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు, సంగీత ద‌ర్శ‌కుడు అరుణ్ చిలువేరు, న‌రేశ్ అయ్య‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…
కీర‌వాణి మాట్లాడుతూ – “సాంగ్ విన్నాను. చాలా కొత్త‌గా అనిపించింది. ఈ సినిమాకు సంగీతం అందించిన అరుణ్ చిలువేరు అద్భుత‌మైన మెలోడి మ్యూజిక్‌ను అందించ‌గ‌ల‌రు. త‌ను గిటారిస్ట్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌ట్నుంచి నాకు తెలుసు. ట్యూన్ చాలా బావుంది. `ఆశ‌గా ఆశ‌కే ఆయువు పెంచ‌గా..` వంటి సాహిత్యం ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. న‌రేశ్ అయ్య‌ర్ పాట‌ను చాలా చ‌క్క‌గా పాడాడు. సినిమాలోని మిగిలిన రెండు పాట‌లు కూడా శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
క‌ల్యాణ్ మాలిక్ మాట్లాడుతూ – “`ఐతే`సినిమాకు నేనే మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఆ సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటే.. దాన్ని అన్న‌య్య కీర‌వాణిగారు పాడారు. ఇప్పుడు అన్య‌య్య‌తో క‌లిసి `ఐతే 2.0`  సాంగ్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. అరుణ్ నా మ్యూజిక్ టీంలో గిటారిస్ట్‌గా ప‌నిచేశారు. త‌న‌తో ప‌నిచేయ‌డం కూల్‌గా ఉంటుంది. `ఐతే` సినిమాలాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ సాధించాలి“ అన్నారు.
న‌రేశ్ అయ్య‌ర్ మాట్లాడుతూ “మ‌నం క్యాజువ‌ల్‌గా పాడుకునేలా ఈ పాట ఉంటుంది. కిట్టు విస్సాప్ర‌గ‌డ అందించిన సాహిత్యం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. సాంగ్స్, సినిమా అంద‌రినీ మెప్పిస్తాయి“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అరున్ చిలువేరు మాట్లాడుతూ – “కీర‌వాణిగారి చేతుల మీదుగా పాట విడుద‌ల కావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన రాజ్ మాదిరాజుగారికి థాంక్స్‌. `నింగిపై..` అనే సాహిత్యంతో కూడిన ఈ పాట‌ను న‌రేశ్ అయ్య‌ర్ పాడ‌టం సంతోషంగా ఉంది. కిట్టు మంచి సాహిత్యాన్ని అందించారు“ అన్నారు.
 
డైరెక్ట‌ర్ రాజ్ మాదిరాజు మాట్లాడుతూ – “మా `ఐతే 2.0`లో మూడు సాంగ్స ఉన్నాయి. ఇందులో ముగ్గురు హీరోలకు సంబంధించిన వివిధ నేప‌థ్యాల్లో ఈ మూడు సాంగ్స్ వ‌స్తాయి. ఆక‌లి, ఆశ‌, కోపం అనే మూడు అంశాల‌పై ఈ మూడు సాంగ్స్ ఉంటాయి. అరుణ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వ‌ద్ద అరుణ్ ప‌నిచేశాడు. త‌న‌ని `ఐతే 2.0` సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు గిటార్ అంటే చాలా అభిమానం. అందులో అరుణ్ మాస్ట‌ర్‌. `నింగిపై…` అనే సాఫ్ట్ రాక్ నెంబ‌ర్‌కు కిట్టు విస్సా ప్ర‌గ‌డ చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు. త‌ను నాకు `రిషి` సినిమా నుండి ప‌రిచ‌యం. త‌ను మిగిలిన రెండు పాట‌లు రాయ‌డ‌మే కాకుండా.. సంభాష‌ణ‌ల్లో సైతం సహ‌కారం అందించారు. క‌రొకే ట్రాక్‌, స్మైల్ యాప్‌లో కూడా సాంగ్స్ అందుబాటులో ఉంటాయి“ అన్నారు.
 
నిర్మాత విజ‌య్ రామ‌రాజు మాట్లాడుతూ – “మార్చి 16న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here