ఐపిఎల్ ఓపెనింగ్ లో త‌మ‌న్నా అదుర్స్..


త‌మ‌న్నా చంపేసింది.. ముంబైలో జ‌రిగిన ఐపిఎల్ ఓపెనింగ్ లో అమ్మ‌డు అదిరిపోయేలా చిందేసింది. జై ల‌వ‌కుశ‌లోని స్వింగ్ జ‌రాతో పాటు జాగ్వ‌ర్.. బాజీరావ్ మ‌స్తానీ లాంటి సినిమాల్లోని పాట‌ల‌కు త‌మ్మూ చిందేసింది.
ఈ భామ చిందుల‌తో ముంబై వాంఖ‌డే స్టేడియం అంతా హోరెత్తి పోయింది. ఎప్రిల్ 7 సాయంత్రం జ‌రిగిన ఈ వేడుక‌లో త‌మ‌న్నాతో పాటు ఇంకా చాలా మంది బాలీవుడ్ సెలెబ్రెటీస్ డాన్సులు చేసారు. జాక్వ‌లిన్ అదిరిపోయే అందాల షో చేస్తే..
హృతిక్ రోష‌న్ ధూమ్ ధూమ్ అంటూ దున్నేసాడు. అందాల ముద్దుగుమ్మ‌ల ఆట‌పాట‌లు.. అదిరిపోయే లైట్స్ షో.. దానికితోడు ఐపిఎల్ కెప్టెన్స్.. వేలాది మంది అభిమానుల మ‌ధ్య ఐపిఎల్ ఓపెనింగ్ గ్రాండ్ గా జ‌రిగింది. తొలిమ్యాచ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. మొత్తానికి క్రికెట్ కంటే ముందే మ‌న సినిమా వాళ్ల త‌ళుకుళ‌తో స్టేడియం అంతా ద‌ద్ధ‌రిల్లిపోయింద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here