ఒకే వేదిక‌పై చిరంజీవి.. ప‌వ‌న్.. చ‌ర‌ణ్..!


మెగా అభిమానుల‌కు అంతకంటే క‌న్నుల పండ‌గ మ‌రోటి ఏం ఉంటుంది చెప్పండి..? ఒకే వేదిక‌పై చిరుతో పాటు ప‌వ‌న్ ను చూడ‌ట‌మే అభిమానుల‌కు పండ‌గ‌. ఆ మ‌ధ్య స‌ర్దార్ ఆడియో వేడుక‌లో ఇది జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత‌వ‌ర‌కు ఒకేసారి అన్నాద‌మ్ములిద్ద‌రూ క‌నిపించ‌లేదు.
మ‌ధ్య‌లో ఓ సారి అజ్ఞాత‌వాసికి అన్న‌య్య వ‌స్తాడ‌ని చెప్పినా రాలేదు. ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ కు ప‌వ‌న్ వ‌స్తాడ‌ని చివ‌ర్లో హ్యాండిచ్చాడు. దాంతో అన్నాద‌మ్ములిద్ద‌రూ ఒకే సారి ఏ వేదిక‌పై క‌నిపించ‌లేదు. కానీ ఇప్పుడు అది క‌నిపించ‌బోతుంది. అయితే అది ఈ ఇద్ద‌రి సినిమాల‌కు కాదు. రామ్ చ‌ర‌ణ్ ఈ అన్నాద‌మ్ములిద్ద‌రినీ క‌లుపుతున్నాడు. రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్ ఎప్రిల్ 13 సాయంత్రం యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జ‌రుగుతుంది.
ఈ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నాడ‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసారు. కానీ ఇదే వేడుక‌కు చిరు కూడా వ‌స్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యాన్ని కావాల‌నే గోప్యంగా ఉంచారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఒకే వేదిక‌పై అన్నాద‌మ్ముల‌తో పాటు అబ్బాయిని కూడా చూసి అభిమానులు థ్రిల్ అయిపోతారేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here