కాజ‌ల్.. మ‌రీ ఇలా అయితే ఎలా..? 

Kajal Agarwal Launches New Ponds Starlight Perfumed Talc
ఏం చేసింది.. కాజ‌ల్ అంత‌గా ఏం చేసింది అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో రెమ్యున‌రేష‌న్ అంటే చూసి చూడ‌న‌ట్లుగా ఉండాలి. ఇండ‌స్ట్రీ అన్న త‌ర్వాత చెప్పినంతా ఇస్తార‌నే క్లారిటీ లేదు. ఇంకా హీరోయిన్ల విష‌యంలో అయితే ఒక్కోసారి ఫుల్ రెమ్యున‌రేష‌న్ కూడా ఎగ‌ర‌గొడుతుంటారు. దీనిపై హీరోయిన్లు కూడా ఏం మాట్లాడ‌లేక కామ్ గా ఉండిపోతారు. కానీ కాజ‌ల్ మాత్రం వీటికి భిన్నం. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు చంద‌మామ‌. కొత్త హీరోయిన్లు వ‌స్తున్నా.. పోటీ ఇంత‌గా ఉన్నా.. త‌న రేట్ ఇంతే అని ఫిక్స్ అయిపోయింది. అంత‌కంటే త‌క్కువంటే.. సారీ అని మొహం మీదే చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు ర‌వితేజ‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితులే ఎదుర‌య్యాయి. శీనువైట్ల సినిమా కోసం ముందు ఈ భామ‌ను అడిగితే ఓకే అనేసింది. కానీ త‌ర్వాత పారితోషికం స‌రిపోలేద‌ని సారీ చెప్పేసింది. కాజ‌ల్ ఇలా చేయ‌డం ఇదే తొలిసారి కాదు.
గ‌తంలోనూ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి సూప‌ర్ స్టార్స్ విష‌యంలోనూ క‌నిక‌రం చూప‌లేదు చంద‌మామ‌. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిందే డ‌బ్బు సంపాదించుకోడానికి కానీ సేవ చేయ‌డానికి కాదు అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుంది కాజ‌ల్. ఈమె మాట‌లు కొంద‌రిని హ‌ర్ట్ చేసినా.. కాజ‌ల్ మాట‌ల్లో నిజం లేక‌పోలేద‌ని కొంద‌రు ఆమెతో ఏకీభవిస్తున్నారు. రిలేష‌న్ ఉంటే అది బ‌య‌టి వ‌ర‌కు ఉంటే ఓకే కానీ సినిమాల్లో ప‌నికిరాద‌నేది కాజ‌ల్ భావ‌న‌. అక్క‌డ మాత్రం త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే. అంతెందుకు ఖైదీ నెంబ‌ర్ 150లో న‌టించ‌డానికి కూడా ముక్కుపిండి మ‌రి కోటిన్న‌ర‌కు పైగానే వ‌సూలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మ‌ళ్లీ రామ్ చ‌ర‌ణ్ తో నాలుగు సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది.. స్నేహం ఉంది.. పారితోషికం ద‌గ్గ‌ర మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోదు కాజ‌ల్. ఇలాగే ఉండాలి మ‌రి.. ఇండ‌స్ట్రీలో నెగ్గుకురావాలంటే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here