కార్వాన్ ట్రైల‌ర్.. కామెడీ అదిరింది..!

మ‌ళ‌యాలంలో ఎంట్రీ ఇచ్చాడు.. త‌మిళ్ లోకి అడుగు పెట్టాడు.. తెలుగులోనూ స‌త్తా చూపించాడు.. ఇప్పుడు హిందీకి వ‌చ్చేసాడు. అత‌డే దుల్కర్ సల్మాన్. మ‌హాన‌టితో ఈ మ‌ధ్యే తెలుగులో స‌త్తా చూపించిన ఈ కుర్ర హీరో ఇప్పుడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టాడు. కార్వాన్ సినిమాతో హిందీలో అడుగు పెడుతున్నాడు దుల్క‌ర్. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది ఓ ట్రావెల్ సినిమా.

ఇందులో దుల్కర్ స‌ల్మాన్ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా న‌టిస్తున్నాడు. త‌న తండ్రి గంగోత్రికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు చనిపోతాడు. అత‌డి డెడ్ బాడీ అనుకోకుండా మ‌రో చోటికి వెళ్లిపోతుంది. వేరే చోటికి వెళ్లాల్సిన బాడీ దుల్క‌ర్ ద‌గ్గ‌రికి వ‌స్తుంది. దాంతో తండ్రి డెడ్ బాడీని తెచ్చుకోడానికి ఇర్ఫాన్ ఖాన్ ను న‌మ్ముకుంటాడు. అత‌డు డ్రైవ‌ర్. ఈ క్ర‌మంలోనే మ‌రో అమ్మాయి ఈ జ‌ర్నీలో జాయిన్ అవుతుంది.

దుల్కర్ కు వ‌చ్చిన డెడ్ బాడీ ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిదే ఉంటుంది. ఈ ముగ్గురి మ‌ధ్య జ‌రిగే ప్ర‌యాణ‌మే సినిమా. సాధార‌ణంగా డెడ్ బాడీతో ప్రయాణం.. తండ్రుల చావు అంటే సీరియ‌స్ గా ఉంటుంది కానీ కార్వాన్ ను మాత్రం ద‌ర్శ‌కుడు ఆకాష్ ఖురానా ఫుల్ కామెడీగా తీసాడు. అస‌లు ఇర్ఫాన్ ఖాన్ కారెక్ట‌ర్ అయితే హిలేరియ‌స్ గా ఉంది. చూస్తుంటే ఈ చిత్రంతో బాలీవుడ్ లోనూ దుల్క‌ర్ కు తొలి హిట్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఆగస్టు 3న కార్వాన్ విడుద‌ల కానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here