కాలా.. కుమ్మేసాడు బాబోయ్.. 

Rajini Kaala
ర‌జినీకాంత్ సినిమా అంటేనే అదో ర‌కం తెలియ‌ని వైబ్రేష‌న్. ఆయ‌న వ‌స్తున్నాడంటే తెలియ‌కుండానే అభిమానుల్లో క‌రెంట్ పాస్ అవుతుంది. తెర‌పై ఆయ‌న్ని చూస్తుంటే మ‌న‌కే తెలియ‌ని ఓ జోష్ నెత్తురులో పాకిపోతుంది. ఇక ఇప్పుడు ఆయ‌న న‌టించిన కాలా టీజ‌ర్ విడుద‌లైంది. మ‌రోసారి ర‌జినీ అదే మాయ చేసాడు. వ‌య‌సు 70కి చేరువ‌లో ఉన్నా కూడా ఇప్ప‌టికీ జోరు త‌గ్గ‌లేదు. స్టైల్ లో త‌న‌ను మించిన వాళ్లు ఈ ప్ర‌పంచంలో లేరు అని మ‌రోసారి నిరూపించుకున్నాడు సూప‌ర్ స్టార్. కాలా టీజ‌ర్ లో ర‌జినీ మేన‌రిజ‌మ్స్.. డైలాగులు అన్నీ పిచ్చెక్కిస్తున్నాయి. ముఖ్యంగా పూర్తి రౌడీ యిజం ఇంకా చూడ‌లేదు క‌దా.. ఇప్పుడు చూపిస్తానంటూ ర‌జినీ చెప్పిన డైలాగ్ టీజ‌ర్ కే హైలైట్. ఇక పందులే గుంపుగా వ‌స్తాయి అని శివాజీలో చెబితే ఇక్క‌డ వీర‌య్య కొడుకునురా ఒక్క‌న్నే వ‌చ్చా.. ఎంత‌మంది వ‌స్తారో రండ్రా అంటూ మ‌రోసారి త‌న స్టైల్ లో ఓ మాస్ డైలాగ్ పేల్చాడు ర‌జినీకాంత్.
ర‌జినీ ఇప్పుడు సినిమా హీరోనే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడు కూడా. ఇప్పుడు ఈయ‌న సినిమాల్లో రాజ‌కీయాలు లేక‌పోతే ఆశ్చ‌ర్య‌ప‌డాలి.. ఉంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయ‌న ఎంచుకునే క‌థ‌ల్లో క‌చ్చితంగా రాజ‌కీయం ఉండాల్సిందే. ఇప్ప‌టికే రాజకీయ అరంగేట్రం చేసిన ర‌జినీ.. కాలాలో కావాల్సిన‌న్ని రాజ‌కీయ డైలాగులు చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. టీజ‌ర్ లో కూడా సెటైర్లు బాగానే వేసాడు ర‌జినీకాంత్. కాలా పాత్ర చుట్టూనే రాజ‌కీయాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ముంబైలో అణిచివేయ‌బ‌డిన త‌మిళుల కోసం పోరాడే పాత్ర ఇది. రంజిత్ ఈ సినిమాలో ర‌జినీతో కావాల్సిన‌న్ని పొలిటిక‌ల్ సెటైర్లు వేయించాడు ద‌ర్శ‌కుడు రంజిత్. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఎప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది. ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి రంజిత్ ద‌ర్శ‌కుడు. నానా ప‌టేక‌ర్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. కాలా క‌రికాల‌న్ గా ర‌జినీ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here