కాలా క‌ర్ణాట‌క‌లో రిలీజ్.. లాభం ఉందా..?

Kaala Karnataka

చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుని లాభం ఉంటుందా..? ఉండ‌దుగా.. ఇప్పుడు కాలా ప‌రిస్థితి కూడా అంతే. ఈయ‌న సినిమా ఇప్ప‌డు క‌ర్ణాట‌క‌లో విడుద‌లైంది. ఒక్క‌రోజే క‌దా ఆల‌స్యంగా విడుద‌ల అయింది.. ఇప్పుడు ఏమైంది విడుద‌లైంది క‌దా ఎప్పుడో ఓ సారి అని స‌ర్దుకోవాలా..? అలా చేస్తే నిర్మాత‌ల‌కు ఇప్పుడు మునిగిపోవ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు. దానికి పక్కా కార‌ణం కూడా ఉంది. ఎందుకంటే కాలా సినిమాకు తొలి రోజే యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. త‌మిళ‌నాట ఈ టాక్ తో ఓకే కానీ ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో మాత్రం కాదు.

ర‌జినీకాంత్ ఉన్నా కూడా స్లోగా సాగ‌డం కాలాకు మైన‌స్ గా మారింది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో విడుద‌లైనా కూడా ఈ టాక్ ప్ర‌భావం భారీగా ప‌డుతుంది. సాధార‌ణంగా తొలిరోజు క‌ర్ణాట‌క‌లో ర‌జినీ సినిమాల‌కు 5 నుంచి 7 కోట్ల ఓపెనింగ్ వ‌స్తుంది. కానీ కాలాకు మాత్రం 2 కోట్ల వ‌ర‌కు కూడా వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. దానికి నెగిటివ్ టాక్ కార‌ణం. పైగా ర‌జినీపై ఉన్న కోపం కూడా ఈ చిత్ర క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. మొత్తానికి క‌ర్ణాట‌క‌లో ఆల‌స్యంగా విడుద‌ల కావ‌డం కాలాకు ఇప్పుడు శాపంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here