కాలా.. రికార్డులేవీ క‌ద‌ల్లేదుగా..!

Rajni Kaala

ర‌జినీకాంత్ సినిమా వ‌చ్చిందంటే క‌చ్చితంగా కొత్త రికార్డులు వ‌స్తాయి. ఆయ‌న సినిమా ఎలా ఉంది అని ఎవ‌రూ అడ‌గ‌రు.. ఎలా ఉన్నా తొలిరోజు రికార్డుల‌న్నీ క‌దిలిపోవాల్సిందే. కానీ ఈ సారి మాత్రం అది జ‌ర‌గ‌లేదు. ఎందుకో తెలియ‌దు కానీ ముందు నుంచి కాలా కాస్త త‌క్క‌వ అంచ‌నాల‌తోనే వ‌చ్చింది. ఇప్పుడు దీనికి ఫ‌లితం కూడా క‌నిపిస్తుంది. తొలిరోజు ఈ చిత్రం ఎక్క‌డా రికార్డు వ‌సూళ్లు అయితే సాధించ‌లేదు.

తెలుగులో క‌బాలి ఏకంగా 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. అప్ప‌ట్లో అది చాలా ఎక్కువ ఓ డ‌బ్బింగ్ సినిమాకు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే తెలుగులో తొలిరోజు కాలాకు 6 కోట్ల షేర్ కూడా రావ‌డం క‌ష్ట‌మే. త‌మిళ‌నాట మాత్రం కాలాకు భారీ ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం క‌బాలితో పోలిస్తే స‌గం కూడా తీసుకురాలేదు కాలా. ఆ సినిమా ప్రీమియ‌ర్స్ తోనే 1.9 మిలియ‌న్ తీసుకొస్తే..

ఇది కేవ‌లం 6 ల‌క్ష‌ల డాల‌ర్స్ తో స‌రిపెట్టుకుంది. పైగా సినిమా కూడా యావ‌రేజ్ టాక్ తోనే మొద‌లైంది. త‌మిళ‌నాట ర‌జినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ తో ఎలాగోలా క‌బాలిలా క‌మ‌ర్షియ‌ల్ గా లాగేస్తుందేమో కానీ అభిమానులు కోరుకున్న సినిమా మాత్రం మ‌ళ్లీ ఇవ్వ‌లేక‌పోయాడు రంజిత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here