కాలేజీ ఈడంటూ.. ఎల్ కేజీ డ్ర‌స్సేసీ..

taapsee-pannu-stills-photos-pictures-1026
తాప్సీని చూస్తుంటే ఇప్పుడు ఇదే పాట పాడాల‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య బాలీవుడ్ బుద్దులు బాగానే ఒంట‌ప‌ట్టించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. బికినీలు వేయ‌డాలు.. మూతి ముద్దులు ఇవ్వ‌డాలు ఇవ‌న్నీ తాప్సీకి అల‌వాటైపోయాయి. ఇక్క‌డ ఉన్న‌పుడు అందాలు ఆర‌బోసినా కూడా హ‌ద్దుల్లో ఉండేది ఈ భామ‌. కానీ  బాలీవుడ్ లో ఇప్పుడు ఆ హ‌ద్దులు క‌నిపించ‌ట్లేదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అందాల ఆర‌బోత ఫుల్లుగా చేస్తుంది. ఏ ఫంక్ష‌న్ కు వ‌చ్చిన కెమెరాలన్నీ త‌న‌పైనే ఉండేలా క్యాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకుంటుంది ఈ భామ‌. కొంటెగా తినేసేలా చూపుల‌తో అంద‌ర్నీ చంపేస్తుంది తాప్సీ. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. కానీ అవ‌కాశాలే ముద్దుగుమ్మ‌ను చిన్న‌చూపు చూస్తున్నాయి. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా.. అమ్మ‌డుకు విజ‌యం మాత్రం వెక్కిరించింది.
ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఆనందో బ్ర‌హ్మ మాత్రం మంచి విజ‌యం సాధించినా.. అది ఆమె కెరీర్ కు పెద్ద‌గా యూజ్ కాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అమ్మ‌డి జాత‌కం హై రేంజ్ లో ఉంది. అక్క‌డ న‌టించిన సినిమాల్లో 90 శాతం మంచి విజ‌య‌మే సాధించాయి. గ‌తేడాది వ‌చ్చిన జుడ్వా 2 కూడా 200 కోట్ల క్ల‌బ్ లో చేరింది. అయినా గానీ ఈ భామ‌ను ఎందుకో మ‌న ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు. దాంతో ఇదిగో ఇలా అప్పుడ‌ప్పుడూ హాట్ ఫోటోషూట్స్ తో ద‌ర్శ‌కుల మ‌దిలో ప‌డ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అస‌లే స‌న్న‌గా మెరుపుతీగ‌లా ఉండే తాప్సీ.. ఇప్పుడు మ‌రింత స‌న్న‌బ‌డింది తాప్సీ. దాంతో స‌న్నాజాజిలా పుట్టేసిందిరో అంటూ చిరంజీవి పాట పాడుకోవాల్సి వ‌స్తుంది ఈ ఢిల్లీ భామ‌ను చూస్తుంటే..! మ‌రి ఈ భామ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా ఏ ద‌ర్శ‌కుడైనా క‌రిగిపోతాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here