కిరాక్ పార్టీ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20180316

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: కిరాక్ పార్టీ
న‌టీన‌టులు: నిఖిల్, సిమ్రాన్ ప‌రీంజా, సంయుక్తా హెగ్డే, రాకెందు మౌళి త‌దిత‌రులు
సంగీతం: అజ్నీష్ లోక్ నాథ్
సినిమాటోగ్ర‌ఫీ: అద్వైత గురుమూర్తి
మాట‌లు: చ‌ందూమొండేటి
స్క్రీన్ ప్లే: సుధీర్ వ‌ర్మ
ద‌ర్శ‌కుడు: శ‌ర‌ణ్ కొప్పిశెట్టి
క‌న్న‌డ సినిమాలు తెలుగులో రీమేక్ చేయ‌డం అరుదు. అక్క‌డ వ‌చ్చిన సినిమాలు ఇక్క‌డ క‌నెక్ట్ అవుతాయో లేదో అని మ‌న ద‌ర్శ‌కుల‌కు డౌట్. అందుకే వాటి జోలికి వెళ్ల‌రు. కానీ చాలా రోజుల త‌ర్వాత అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. అదే కిరాక్ పార్టీ. మ‌రి తెలుగులోనూ ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా..?
క‌థ‌:
కృష్ణ‌(నిఖిల్) ఇంజ‌నీరింగ్ స్టూడెంట్. అత‌డికి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒక‌టి ఉంటుంది. ఫ‌స్ట్ ఇయ‌ర్ లోనే సీనియ‌ర్స్ తో గొడ‌వ‌ప‌డి లీడ‌ర్ అవుతాడు. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ అయిన మీరా(సిమ్రాన్ ప‌రీంజా) కృష్ణ‌కు న‌చ్చుతుంది. ఆమెకు కూడా కృష్ణ న‌చ్చుతాడు. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు కూడా. కానీ అదే స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా మీరా చనిపోతుంది. దాంతో కృష్ణ షాక్ లోకి వెళ్లిపోతాడు. మారుతున్న కాలంతో పాటే మీరా జ్ఞాపకాల్లోనే ఉంటాడు. ఆ స‌మ‌యంలో కృష్ణ జీవితంలోకి స‌త్య (సంయుక్తా హెగ్డే) వ‌స్తుంది. కృష్ణ‌ను ప్రేమిస్తుంటుంది. మ‌రోవైపు కాలేజ్ లో లీడ‌ర్ అవుతాడు కృష్ణ‌. అక్క‌డ్నుంచి కృష్ణ జీవితం ఎలా మారింది.. స‌త్య‌ను ప్రేమించాడా.. అస‌లు మీరా ఎలా చ‌నిపోతుంది అనేది మిగిలిన క‌థ‌..!
క‌థ‌నం:
కొన్ని ఎమోష‌న్స్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేం. అందులో కాలేజ్ ఒక‌టి.. మ‌న జీవితంలో మ‌రిచిపోలేని టైమ్ అది. అందుకే ఎన్నిసార్లు సినిమాల్లో ఈ క‌థ చూసినా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు కిరాక్ పార్టీలోనూ క‌నిపించింది అదే. కాలేజ్ క‌థ‌నే మ‌రోసారి ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి. క‌న్న‌డ‌లో వ‌చ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల కోసం కాస్త మార్చాడు ఈ ద‌ర్శ‌కుడు. దానికి చందూ, సుధీర్ వ‌ర్మ‌లు కూడా సాయం చేసారు. కిరాక్ పార్టీ చూస్తున్న‌పుడు తెలియ‌కుండానే శివ‌.. ప్రేమ‌మ్.. హ్యాపీడేస్.. ఇలా చాలా సినిమాలు మైండ్ లోకి వ‌స్తుంటాయి. అది ద‌ర్శ‌కుడి త‌ప్పు కూడా కాదు. ఎందుకంటే కాలేజ్ క‌థ‌ల‌కు ఈ సినిమానే కేరాఫ్ అడ్ర‌స్ కాబ‌ట్టి. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా మ‌న‌కు తెలియ‌కుండానే మైండ్ లోకి ఆ సినిమాలు వ‌స్తుంటాయి. కానీ ఎన్ని గుర్తుకు వ‌చ్చినా కూడా స్క్రీన్ పై మ్యాజిక్ న‌డుస్తూనే ఉంటుంది. ఫ‌స్టాఫ్ కాలేజ్ సీన్స్ అన్నీ చాలా ఫ‌న్నీగా వ‌ర్క‌వుట్ అయ్యాయి.
మ‌నం కాలేజ్ లో సీన్సే కావ‌డంతో క‌చ్చితంగా ఆ అల్ల‌రి క‌నెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ కు కిరాక్ పార్టీ బాగానే క‌నెక్ట్ అవుతుంది. అక్క‌డ జ‌రిగే సీన్స్ అన్నీ సినిమాలో రీ క్రియేట్ చేసాడు ద‌ర్శ‌కుడు. తెలిసిన క‌థే అయినా చాలా వ‌ర‌కు బోర్ కొట్ట‌కుండా స్క్రీన్ ప్లే రాసాడు సుధీర్ వ‌ర్మ‌. అయితే సెకండాఫ్ లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించాయి.. క‌థ ముందుకు సాగ‌లేక మొరాయించింది కూడా. క్లైమాక్స్ లో ఫేర్ వెల్ పార్టీ కాలేజ్ డేస్ ను క‌చ్చితంగా గుర్తు చేస్తుంది. సంయుక్తా హెగ్డేతో నిఖిల్ ల‌వ్ ట్రాక్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.. ఆక‌ట్టుకోలేదు కూడా. ఓవ‌రాల్ గా కిరాక్ పార్టీ ఊహించినంత కిరాక్ కాక‌పోయినా ఓకే అనిపిస్తుంది.. కాలేజ్ డేస్ మ‌ళ్లీ రీ కాల్ చేసి.. జ్ఞాపకాల‌ను గుర్తు చేస్తుంది ఈ కిరాక్ పార్టీ.
న‌టీన‌టులు:
నిఖిల్ సినిమా సినిమాకు న‌ట‌న‌లో మెరుగ‌వుతున్నాడు. హ్యాపీడేస్ నుంచి ఇప్ప‌టికి అత‌డిలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఫ‌స్టాఫ్ లో బిటెక్ స్టూడెంట్ పాత్ర‌కు ప్రాణం పోసాడు నిఖిల్. సిమ్రాన్ ప‌రీంజా కారెక్ట‌ర్ బాగా అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ఆమె పాత్ర ముగించిన తీరు మాత్రం ప్రేక్ష‌కుల‌కు క‌చ్చితంగా నిరాశ తెప్పిస్తుంది. మ‌రోలా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సెకండాఫ్ లో సంయుక్తా హెగ్డే ఎన‌ర్జిటిక్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. సొంత డ‌బ్బింగ్ కూడా బాగుంది. ఫ్రెండ్స్ కారెక్ట‌ర్స్ లో రాకేందు మౌళి ఆక‌ట్టుకున్నాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా బాగుంది. బ్ర‌హ్మాజీ కారెక్ట‌ర్ ఉన్నంత‌లో ఓకే.
టెక్నిక‌ల్ టీం:
కిరాక్ పార్టీకి చందూ మొండేటి మాట‌లు బాగానే సాయ‌ప‌డ్డాయి. అద్భుత‌మైన డైలాగులు రాయ‌క‌పోయినా.. సంద‌ర్భానుసారంగా వ‌చ్చే మాట‌లు మాత్రం బాగానే అనిపించాయి. సుధీర్ వ‌ర్మ‌కు టైట్ స్క్రీన్ ప్లే రాయ‌డానికి క‌థ స‌హ‌క‌రించ‌లేదు. ఉన్నంత‌లో ఆయ‌న బాగానే చేసాడు. అజ్నీష్ లోక్ నాథ్ అందించిన పాట‌లు బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ బెంచ్ లో పాట కుర్రాళ్ళ‌తో విజిల్స్ వేయిస్తుంది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ వీక్. సెకండాఫ్ లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపించాయి. ద‌ర్శ‌కుడిగా శ‌ర‌ణ్ కొప్పిశెట్టి త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చాడు.
చివ‌ర‌గా:
కిరాక్ పార్టీ.. ఎంజాయ్ ఎంజాయ్.. కానీ కండీష‌న్స్ అప్లై..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here